India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధి వరసాల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1201 రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు.
నిరుద్యోగులను కంబోడియాకు తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు నిర్వహించగా గాజువాకకు చెందిన ఏజెంట్ కె.వీరేంద్రనాథ్ 17 మందిని కాంబోడియాకు పంపించినట్లు గుర్తించారు. వీరేంద్రనాథ్‌తో పాటు మరో ఏజెంట్ కె.ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పాలీసెట్ కౌన్సిలింగ్ నేటి నుంచి జూన్ 3 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలు.
➣ ప్రాసెసింగ్ ఫీజు రశీదు
➣ పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు
➣ పది, తత్సమాన మార్కుల జాబితా
➣ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
➣ EWS కోటా అభ్యర్థులు సంబంధిత EWS సర్టిఫికేట్
➣ 1-1-2021 తర్వాత నాటి కుల, ఆదాయ సర్టిఫికేట్
➣ టీసీ
➣➣Share it
మామిడి కాయలను కాల్షియం కార్బైట్‌తో మగ్గబెట్టవద్దని ఉద్యాన శాఖ అధికారి జి.రాధిక తెలిపారు. ఈ విధంగా మగ్గపెట్టిన పండ్లను తింటే ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు. పక్వానికి వచ్చిన మామిడికాయలను ఇథలిన్ వాయువు సహాయంతో మగ్గబెడితే కొంత ముప్పు తప్పుతుందని తెలిపారు. పక్వానికి వచ్చిన మామిడి కాయలను గాలి చొరబడకుండా ఉండే గదిలో ఉంచి మగ్గపెట్టాలన్నారు.
సముద్ర తీరానికి సమీపంలో ఉన్నా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పద్మనాభం ప్రాంతంలో 45 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం అనకాపల్లి జిల్లాలో 14, అల్లూరిలోని 10 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలో 42 మండలాల్లో వడగాలులు వీయొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
చినముషిడివాడకు చెందిన తెరపల్లి రాజేష్(33) బ్యాంకాక్‌లో చైనీస్ కంపెనీ నిర్బంధంలో ఉన్నాడు. ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేసిన రాజేష్ థాయిలాండ్‌లో ఉద్యోగానికి గత నెల 25న బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈనెల 10న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఇండియా వెళ్లాలంటే రూ.8 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తండ్రి శివకి చెప్పాడు. ఈ మేరకు తండ్రి విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు.
మరో 8 రోజుల్లో APకి కాబోయే CM ఎవరో తేలిపోనుంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని YCP నాయకులు డేట్, టైం ఫిక్స్ చేశారు. అటు TDP నాయకులు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దీంతో జూన్ 8,9 తేదీల్లో విశాఖలోని హోటల్ రూములన్నీ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఏపీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని మీరు భావిస్తున్నారు.
విశాఖ నగరంలో శనివారం అర్ధరాత్రి వరకు పోలీసులు పలుచోట్ల విస్తృతంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్వయంగా పర్యవేక్షించారు. జోన్-1 పరిధిలో ఫోర్ వీలర్స్-17, టూ వీలర్స్-148, ఆటోలు-17, జోన్-2 పరిధిలో టూ వీలర్స్-175, ఆటోలు-10, ఫోర్ వీలర్స్-14, ఒక కమర్షియల్ వాహనంపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు చెందిన ఆరో సెమిస్టర్ ఫలితాలు వెలువడ్డాయి. 27,603 మంది విద్యార్థులు ఆరో సెమిస్టర్‌కు హాజరు కాగా 27,483 మంది ఉత్తీర్ణులైనట్లు ఏయూ డిగ్రీ కళాశాల ఎగ్జామినేషన్ డీన్ ఆచార్య డీవీఆర్ మూర్తి తెలిపారు. 99.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏయూ వెబ్ సైట్‌లో ఉన్నాయని వెల్లడించారు.
ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొయ్యూరు మండలంలోని బాలరేవుల గ్రామానికి చెందిన పిట్టల కామేశ్ ఉపాధి కోసం కత్తిపూడి ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కామేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.