Visakhapatnam

News September 26, 2024

అమెరికా పర్యటనకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆ సంఘం ఆహ్వానం మేరకు ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. వాషింగ్టన్ డీసీలోని లీస్బర్గ్ నగరంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న వేడుకల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొంటారు. తిరిగి అక్టోబరు 8న రాష్ట్రానికి చేరుకుంటారు.

News September 26, 2024

విశాఖలో హర్షసాయి బంధువులను విచారించిన పోలీసులు?

image

హైదరాబాద్‌లో రేప్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిన్న విశాఖలో HYD పోలీసులు హర్షసాయి బంధువులను విచారించినట్లు సమాచారం. అయితే అతను విజయవాడలో ఉన్నట్లు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షసాయి కేసులో అతడి లాయర్ విజయవాడకు చెందిన టీ.చిరంజీవి సహకారంతో విజయవాడలో తలదాచుకున్నట్లు తాజాగా కథనాలు వెలువడ్డాయి.

News September 26, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణ కమిటీ

image

విశాఖ <<14184296>>స్టీల్ ప్లాంట్‌<<>>లో ఈనెల 24న జరిగిన ప్రమాదంపై యజమాన్యం ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. పీపీఎం విభాగాధిపతి శంకర్ జీ, ఎస్ఎంఎస్-1కు చెందిన ఆర్పీ సింగ్, ఎస్ఎంఎస్-2 నుంచి శశికాంత్, సేఫ్టీ విభాగం నుంచి ఎం.వరప్రసాద్, క్యూఏ విభాగానికి చెందిన అప్పారావుతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 28 నాటికి కమిటీ నివేదిక అందజేయాలని ప్లాంట్ సీసీఎం ఆర్.మహంతి కోరారు.

News September 26, 2024

విశాఖ: నేడు ఫార్మాసిటీని సందర్శించినన్న హై పవర్ కమిటీ

image

పరిశ్రమలకు సంబంధించి హై పవర్ కమిటీ ఛైర్ పర్శన్ వసుధ మిశ్రా గురువారం ఫార్మసిటీలో పర్యటించనున్నారు. ఇటీవల అచ్యుతాపురం, పరవాడలోని పలు ఫార్మా సిటీ కంపెనీలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయా పరిశ్రమలను స్వయంగా పరిశీలించడానికి ఛైర్ పర్శన్ గురువారం విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి పరిశ్రమల పరిశీలనకు వెళతారని అధికారులు తెలిపారు.

News September 26, 2024

విశాఖలో నేడు హెరిటేజ్ వాక్..

image

ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను, విశిష్టతను తెలిపేలా గురువారం విశాఖ టౌన్ హాలు నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల మీదుగా హెరిటేజ్ వాక్ నిర్వహించినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. హెరిటేజ్ వాక్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ అధికారి జ్ఞానవేణి తదితరులు పాల్గొన్నారు.

News September 26, 2024

విశాఖ: వాయు కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు

image

విశాఖ జిల్లాలో వాయు కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గాలి నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారుల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News September 26, 2024

వేంపాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

నక్కపల్లి మండలం వేంపాడు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి నుండి తుని వైపు బైక్ మీద వెళ్లే దేవవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను వెనక నుంచి వెహికల్ ఢీకొట్టి వెళ్లిపోవడంతో ఇద్దరు యువకులు మరణించారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 25, 2024

విశాఖలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

image

ఆరిలోవ బాలాజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. సమాజం సిగ్గుపడే విధంగా ఓ తండ్రి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్సై కృష్ణ వెల్లడించారు. ఒడిశాకు చెందిన వ్యక్తి భార్యా, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. పెద్ద కుమార్తె స్కూల్లో పలుమార్లు కళ్లు తిరిగి పడిపోవడంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే సమాచారం తల్లికి తెలిపారు. బుధవారం తల్లి పోలీసులను ఆశ్రయించింది.

News September 25, 2024

విశాఖ: ఇంటిలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప

image

విశాఖలో జాయింట్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఫకీరప్పను ఇంటెలిజెన్స్ ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. బుధవారం రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా విశాఖ DCP-2 గా మేరీ ప్రశాంతి నియమితులయ్యారు. DCP-2 గా విధులు నిర్వహిస్తున్న తూహిన్ సిహ్నాను అనకాపల్లి ఎస్పీగా బదిలీ చేశారు. అనకాపల్లి ఎస్పీ దీపికను కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ చేశారు.

News September 25, 2024

విశాఖ: EVM గోదాములు తనిఖీ చేసిన కలెక్టర్

image

విశాఖ ప‌రిధిలోని చిన‌గ‌దిలి వ‌ద్ద‌ గల EVM గోదాముల‌ను క‌లెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అఖిల పక్షాల సమక్షంలో బుధవారం త‌నిఖీ చేశారు. త్రైమాసిక త‌నిఖీలో భాగంగా ఆయ‌న గోదాముల‌ను సంద‌ర్శించి అక్క‌డి పరిస్థితిని గ‌మ‌నించారు. వివిధ పార్టీల ప్రతినిధుల‌తో క‌లిసి గోదాముల లోప‌ల ఉన్న వీవీ ప్యాట్ల‌ను పరిశీలించారు.