India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు ఈ ఏడాది రూ.29,000 కోట్లు కేటాయించడం జరిగిందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. శుక్రవారం ఎన్ఏడి జంక్షన్ వద్ద నూతన విద్య వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య అనేది కేవలం విజయం కోసం కాదని అన్నారు. సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనం అన్నారు. అయితే అది డిజిటల్ వైషమ్యాన్ని పెంచకుండా అందరికి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

అల్లూరి జిల్లాలోని అరకు కాఫీ ప్రాధాన్యతను గుర్తించి, ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన టాటా సంస్థ, మార్కెటింగ్ చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో టాటా సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. టాటా సంస్థకు కావలసినంత మేర కాఫీ గింజలను అందించడం జరుగుతుందని చెప్పారు. సంస్థ ఆశించిన స్థాయిలో గింజలు గ్రేడింగ్ చేయిస్తామని కలెక్టర్ తెలిపారు.

విశాఖపట్నం మల్కాపురం ప్రాంతానికి చెందిన దేవకుమార్ గురువారం రాత్రి తన స్నేహితునితో బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగింది. ప్రమాదంలో దేవకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన అతని స్నేహితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. దేవకుమార్ స్నేహితుడు విజయవాడ వాసిగా గుర్తించారు. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

తగరపువలస గోస్తని నదిలో కారు బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. వంతెనపై అంధకారం నెలకొనడంతో గురువారం రాత్రి కారు అదుపుతప్పి నదిలో బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో స్థానికులతో పాటు పోలీసులు సహాయకు చర్యలు చేపట్టారు. మృతుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ సిబ్బందికి చెందిన డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. మరి కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు భాగం అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేసి ఏయూ వెబ్ సైట్‌లో ఉంచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎంటెక్, ఎంప్లానింగ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. విద్యార్థులు ఏయూ వెబ్ సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ (హాల్ టికెట్) నెంబర్ ఉపయోగించి పరీక్షా ఫలితాలను పొందవచ్చును.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా రాష్ట్రం అంతటా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లాకు భాగ్యలక్ష్మి, కెకె రాజులను టాస్క్‌ఫోర్స్ కమిటీగా నిర్ణయించింది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వీరు పని చేస్తారు. జిల్లాల్లో పార్టీ నేతలు, లీగల్‌సెల్ ప్రతినిధుల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది.

విశాఖలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరిగాయని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీలో ప్రస్తావించారు. సుమారు రూ.3వేల కోట్లు విలువ చేసే 300 ఎకరాల భూమిని వైసీపీ హయాంలో ప్రజలను భయపెట్టి లాక్కున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి హస్తం ఇందులో ఉందని తనకు అవకాశం ఇస్తే పూర్తి ఆధారాలతో నిరూపిస్తా అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపట్టాలని బండారు కోరారు.

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463/64), భువనేశ్వర్-తిరుపతి-భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ (22879 /80)నకు రెండు థర్డ్ ఏసీ భోగిలు, అలాగే ఏపీ ఎక్స్‌ప్రెస్, విశాఖ-దిఘా, గాంధిగామ్ సూపర్ ఫాస్ట్‌లకు అదనపు భోగిలు జత చేశామని తెలిపారు.

విశాఖలో నేటి నుంచి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని డిఎంహెచ్ఓ జగదీశ్ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంపై వైద్య సిబ్బందితో అవగాహనా శిబిరం నిర్వహించారు.18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పరీక్షలు చేసి అవసరమగు వారికీ వైద్యం అందిస్తారని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించికోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.