India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా మే
27 నుంచి జూన్ 23 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి కె.సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-రాయగడ(17243), తిరుపతి-విశాఖపట్నం(22708)
డబుల్ డెక్కర్లను మే 27 నుంచి జూన్ 22 వరకు రద్దు చేశారు. రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం-రాజమండ్రి (07467) మెమో ప్యాసింజర్లను మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేశారు.
రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లిందని ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణ రాజు(RRR) అన్నారు. విశాఖ నగరంలోని సీతమ్మధారలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను వ్యతిరేకించిన మొదటి వ్యక్తి తానేనని చెప్పారు. ఆ ఒక్క కారణంతోనే తనను జైల్లో పెట్టించి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. పార్లమెంటు నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్‌తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను పోలీసు జాయింట్ కమిషనర్ ఫక్కీరప్పతో కలిసి తనిఖీ చేశారు. ప్రతి గదికి వేసిన తాళాలు, సీళ్లను పరిశీలించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం హైవే వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక జంక్షన్ వద్ద ఓ ప్రైవేటు బస్సు టర్నింగ్ తిప్పుతుండగా.. తుని నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వినయ్ అనే యువకుడు చనిపోగా.. దుర్గేశ్ గాయపడ్డాడు. మృతుడి స్వగ్రామం, తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
అనకాపల్లి పట్టణ శివారు ప్రాంతాలైన సుబ్రమణ్యం కాలనీ, డీబీ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల నాలుగవ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
పరవాడలో నివాసముంటున్న ఖ్యాతేశ్వర్ తెలంగాణ ఈ సెట్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. 2023లో కంచరపాలెం పాలిటెక్నికల్ కళాశాలలో 80% మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం చదివి ఈ లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం జోగిపాలెం గ్రామానికి చెందిన ఖ్యాతేశ్వర్ తండ్రి విన్నారావు ఉద్యోగం నిమిత్తం పరవాడలో ఉంటున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 24న ఎంఎస్ఎంఈ మేక్‌ఇన్ ఇండియా సపోర్ట్ స్టార్టప్ అండ్ అగ్రిటెక్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డాక్టర్ దాసరి దేవ రాజ్, డీజీఎస్ సంతోష్ కుమార్‌లు ఈ విషయం తెలిపారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం టీటీడీసీలో వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపారు.
మామిడి పండ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విశాఖ నగరంలో కిలో మామిడి పండ్లను రూ.150- రూ.200కు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు వాటి దగ్గరికి వెళ్లడానికి భయపడుతున్నారు.
భారత నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో ఈ ఏడాది డిసెంబర్ 15న నేవీ మారథాన్ నిర్వహించనున్నట్లు సోమవారం నేవీ అధికారులు తెలిపారు. ఆ రోజు 42.2 కి.మీ.తో మారథాన్, 21.1 కి.మీ.తో హాఫ్ మారథాన్, 10 కి.మీ.తో ఆరోగ్య పరుగు, 5 కి.మీ.తో రన్ ఫర్ ఫన్ ఉంటుందని పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని, ఆసక్తి కలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
విశాఖ జిల్లాలో 38, 933 మంది హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టుగా గుర్తించామని వీరిలో 18, 541 మంది ఏఆర్టి మందులు ఉపయోగిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 20 సంవత్సరాల్లో జిల్లాలో 11, 566 మంది మరణించారని జిల్లావ్యాప్తంగా 7 ఈఆర్టి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం మే నెలలో 3 వ ఆదివారాన్ని అంతర్జాతీయ ఎయిడ్స్ స్మృత్యంజలి దినముగా జరుపుతుంటారు.
Sorry, no posts matched your criteria.