India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2019లో పోల్చి చూస్తే 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. అయితే 5,56,819 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు. విశాఖ పార్లమెంట్ పరిధిలో మొత్తం 19,27,303 మంది ఓటర్లు ఉండగా 13,70,484 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా విశాఖ ఎంపీ స్థానంలో 71.11 శాతం మాత్రమే ఓటు వేశారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. విజయవాడ నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా. ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈవీఎంలు భద్రపరచడం, ఎలక్షన్ కౌంటింగ్ తదితర అంశాలపై చర్చించారు.
స్టీల్ ప్లాంట్‌లో జరిగిన స్వల్ప ప్రమాదంలో కార్మికునికి గాయాలయ్యాయి. గంట్యాడ మండలానికి చెందిన జె.సాంబయ్య(55) కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నారు. కోక్ ఒవెన్ వద్ద అదుపుతప్పి స్టీమ్ వాటర్‌లో పడపోయాడు. దీంతో శరీరంపై గాయాలయ్యాయి. వెంటనే రామ్‌నగర్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు తెలిపారు.
బెంగళూరు ఖరగ్పూర్ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే సందీప్ తెలిపారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ప్రత్యేక రైలు నడుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు బెంగళూరులో బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఖరగ్పూర్ నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి తర్వాత రోజు 2:38 కి దువ్వాడ చేరుకుంటుందని తెలిపారు.
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భువనేశ్వర్ నుంచి సోలాపూర్‌కు ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు ఈనెల 20 తేదీ ఉదయం 4:30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుందన్నారు. విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌కు అదేరోజు రోజు ఉదయం 11.43 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 11:45 గంటలకు బయలుదేరి సోలాపూర్ చేరుకుంటుందని తెలిపారు.
రాష్ట్రంలో మళ్లీ YCP అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితుల్లో నెలకొన్నాయని అన్నారు. అధికారులను మార్పుచేసిన ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయన్నారు. రాష్ట్రంలో 175 సీట్లకు దగ్గరగా గెలుపొందుతామని, అనవసరంగా YCP నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 9, 10, 11 తేదీల్లో పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి నిర్ణయించారు. ఈనెల 19, 20, 21 తేదీల్లో మోదకొండమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి ముందుగా నిర్ణయించి, ఏర్పాట్లు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండటంతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధికారులు అనుమతులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాలను జూన్ నెలకు మార్చారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం మన్య ప్రాంతం చల్లబడింది. ఉదయం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. ఏజెన్సీలో గురువారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అనంతగిరిలో 27.2, అరకులో 27.2, చింతపల్లిలో 29.2, డుంబ్రిగుడలో 28.1, గూడెం కొత్తవీధిలో 31.9, జీ.మాడుగులలో 31.2, హుకుంపేటలో 30.0, కొయ్యూరులో 31.3, ముంచంగిపుట్టులో 29.3, పాడేరులో 30.0, పెదబయలులో 28.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాల్తేరు రైల్వే డివిజన్ కమర్షియల్ విభాగం సిబ్బంది ఏప్రిల్ నెలలో అత్యుత్తమ పనితీరు కనబరిచి రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చారు. 47,837 స్పెషల్ డ్రైవ్ ద్వారా గత రికార్డులన్నింటినీ అధిగమించి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఒక్క నెలలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన డివిజన్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరబ్ ప్రసాద్ డివిజన్ కమర్షియల్ సిబ్బందిని అభినందించారు.
అడవుల్లో లభ్యమయ్యే కొంకోడి కూరకు ప్రస్తుతం మంచి గిరాకీ ఏర్పడింది. తొలకరి జల్లులకు అడవుల్లో బండరాళ్ల సందుల్లో ఈ కూర మొలకలు వస్తాయి. ఇది లేత చిగురు ఉన్న సమయంలో మాత్రమే గిరిజనులు సేకరించి వండుకుంటారు. సహజసిద్ధంగా లభ్యమయ్యే కొంకోడి కూర అరుదుగా దొరుకుతుంది. దీంతో గిరిజనులు సంతలు, వివిధ వ్యాపార సముదాయాల్లో అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి జిల్లాలో వాటాను రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.