India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలను ఈనెల 24 నుంచి 27 వరకు విశాఖలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 78వ పురుషులు, మహిళల 17వ ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ప్రముఖ బాక్సర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.
విశాఖ జిల్లాలోని భీమిలికి చెందిన వైసీపీ నేత నుంచి తనకు ప్రాణహాని ఉందని భీమిలికి చెందిన వెంకటలక్ష్మి శుక్రవారం మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. అతని వద్ద 2021నుంచి చిట్టీలు కడుతున్నానని, ఇటీవల చిట్టీ డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తమకు సీఎం చంద్రబాబు, లోకేశ్‌లే న్యాయం చేయాలని ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
విశాఖ జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ-2025 కార్యక్రమానికి సంబంధించి ఖర్చుల కోసం రూ.17,85,820 నిధులు విడుదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం ఈ మేరకు నిధులు విడుదల చేశారు. మెటీరియల్ కొనుగోలు చేయడంతో పాటు ఇతర అవసరాల కోసం వీటిని వాడాలని ఉత్తర్వులు పేర్కొన్నట్లు అధికారులు వివరించారు.
కాకడు-2024 విన్యాసాల్లో భాగంగా ప్లీట్ కమాండర్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు బ్లాక్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ప్లీట్ రియర్ అడ్మిరల్ సునీల్ మీనన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని డార్విన్‌కు నేవీ అధికారులు వెళ్లారు. అక్కడ 28 విదేశీ నౌకాదళాల ఉన్నతాధికారులతో తూర్పు నావికాదళం అధికారులు సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు.
నగరంలో ప్రధానమైన నాలుగు రైతుబజార్లకు వారాంతపు సెలవులను రద్దు చేస్తూ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. సీతమ్మధార, కంచరపాలెం బజార్లకు ప్రతి మంగళవారం, ఎంవీపీ కాలనీ, నరసింహనగర్ బజార్లకు ప్రతి బుధవారం సెలవు. కొందరు రైతులు వారం వారం సెలవు తీసేయాలని కోరడంతో ఆ మేరకు మొదట నాలుగు రైతు బజార్లకు సెలవులు రద్దు చేస్తూ, 24/7 నడపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
గాజువాక మండలం నక్కవానిపాలెం వద్ద లంబోదర ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 75అడుగుల బెల్లం వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ట్విటర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో ట్రెండ్ అవుతున్న వినాయక విగ్రహాల్లో బెల్లం వినాయకుడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ గణేశుడు 1,29,000 వ్యూస్ సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించినట్లు మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు. మేయర్ అధ్యక్షతన స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 250 అంశాలతో అజెండాను ప్రవేశ పెట్టగా 102 అంశాలకు ఆమోదం లభించిందని అన్నారు. సమయాభావం కారణంగా మిగిలిన అంశాలను వాయిదా వేసినట్లు తెలిపారు.
అతిపెద్ద కర్మాగారం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్ -3ని అధికారులు మూసివేశారు. బొగ్గు లేకపోవడం వల్ల దీనిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ -1 మూతపడింది. రూ8 వేల కోట్ల అప్పుల్లో స్టీల్ ప్లాంట్ మునిగిపోయినట్లు కార్మికులు తెలిపారు.
విజయవాడల వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. పోర్ట్ కార్యదర్శి టి.వేణు గోపాల్, వివిధ విభాగాధిపతులు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్‌కు సంబంధిత నగదు చెక్‌ను అందజేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందజేశారని యాజమాన్యం తెలిపింది.
ఏయూలో 23 లక్షల ధ్రువపత్రాలను 1996 నుంచి డిజిటలైజేషన్ చేస్తామని ఏయూ వీసీ శశిభూషణరావు తెలిపారు. ఇందులో మార్కుల జాబితాలు, ఓడీలు ఉంటాయన్నారు. 2023 నుంచి ఏయూలో చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను అకాడమీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)లో ఉంచుతామన్నారు. ఏబీసీకి సంబంధించి ప్రతి విద్యార్థికి ఒక కోడ్ ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఒక సంస్థకు అప్పగిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.