India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు. చంద్రబాబును వారు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కలిశారు. ప్లాంట్ సమస్యలను సీఎంకు వివరించారు. కార్మికులు అంకితభావంతో పనిచేసి పరిశ్రమను లాభాలు బాటలో నడిపితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారని వారు తెలిపారు.
విశాఖ వెంకోజిపాలెంలోని ఓ ఇంట్లో కొండచిలువ కలకలం రేపింది. ‘షూ’లోకి ఓ చిన్న కొండచిలువ దూరింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ దివ్యకాంత్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఆయన కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
‘కమిటీ కుర్రాళ్లు’ చిత్ర యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర నిర్మాత నిహారిక కొణిదల విశాఖలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇందులో పెద్దోడు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. కాగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
జీవీఎంసీ స్థాయిా సంఘం ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు నిలిచినట్లు అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు. ఎన్డీఏ నేతలకు చిత్తశుద్ధి ఉంటే పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాలను వెంటనే సమకూర్చాలని ఆమె ట్విటర్ ద్వారా కోరారు. ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా ప్లాంట్‌ను చంపాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
విశాఖ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందేందుకు అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక జరుగుతుందన్నారు. అర్హులైన వారు ఈ నెల 5వ తేదీ లోపు దరఖాస్తులను డీఈఓ కార్యాలయానికి అందజేయాలని కోరారు.
ముడిచమురు హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు సాధించింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ముడిచమురు నిర్వహణలో అద్భుతమైన ఫలితాలు రాబట్టింది. పోర్టు చరిత్రలో అత్యధికంగా ముడిచమురు నిర్వహించినట్లు ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. మలేషియాకు చెందిన ఎంటీ ఈగల్ వ్యాలరీ క్రూడ్ ఆయిల్ షిప్ నుంచి 1,60,000 టన్నుల ఆయిల్‌ను హ్యాండ్లింగ్ చేసి తన రికార్డ్‌ను తనే అధిగమించినట్లు ఛైర్మన్ తెలిపారు.
ఆరోగ్య భద్రత కల్పించాలని హోంగార్డులు విజ్ఞప్తి చేశారు. విశాఖ నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో హోం కార్డుల సమస్యలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ దర్బార్ నిర్వహించారు. హోమ్ గార్డ్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేయమని వారు విజ్ఞప్తి చేశారు. నెలకు ఉన్న రెండు సెలవులను నాలుగుకు పెంచాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. హోంగార్ల పిల్లలకు ఫీజు రాయితీ సౌకర్యం కల్పించాలని కోరారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కే.భాగ్యలక్ష్మిలతో కలిసి జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు.విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు.
వైసీపీ నాయకుల భూకబ్జాలపై 4న మదనపల్లెలో సదస్సు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ తెలిపారు. విశాఖలో గురువారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో ఆయన తాజారాజకీయ పరిస్థితులను వివరించారు. మదనపల్లిలో ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే రెవెన్యూ రికార్డులను తగలబెట్టారని, దీనికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని సాకులు చెప్తున్నారని అన్నారు.
Sorry, no posts matched your criteria.