Visakhapatnam

News August 2, 2024

హైగ్రీవా భూముల వ్యవహారంలో ఎంవీవీకి షాక్

image

హైగ్రీవా భూ వ్యవహారంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ నేత గంజి వెంకటేశ్వరావుకు షాక్ తగిలింది. ఈ భూ వ్యవహారంలో అక్రమ మైనింగ్‌పై జిల్లా భూగర్భ గనుల శాఖ చర్యలు తీసుకుంది. ఎండాడలోని భూమిని భూగర్భగనుల శాఖ అనుమతి లేకుండా వినియోగించారని నిర్ధారించింది. హైగ్రీవాకు రూ.5,43,39,437 జరిమానా విధించింది. నోటీసు అందుకున్న 15 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

News August 2, 2024

ఏపీకి ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించాలి: విశాఖ ఎంపీ

image

ఏపీకి ఎంఎస్ఎంఈ ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి జితన్ రామ్ మాంఝీను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీ కార్యకలాపాలను ఒక్క డైరెక్టర్‌ మాత్రమే పర్యవేక్షిస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. గాజువాకలో ఉన్న ఎంఎస్ఎంఈ భవనాన్ని త్వరగా ప్రారంభించాలని కోరారు.

News August 2, 2024

విశాఖ: ఇన్‌స్టాలో రీల్‌తో బంధువుల చెంతకు

image

మతిస్థిమితం కోల్పోయిన రమేశ్ అనే వ్యక్తికి GVMC షెల్టర్ మేనేజర్ మమత మానసిక చికిత్స అందించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 4 నెలల కిందట గాజువాక వద్ద మతిస్థిమితం కోల్పోయి ఫుట్‌పాత్‌పై తిరుగుతున్న యువకుడిని మమత బుచ్చిరాజుపాలెం GVMC షెల్టర్ లో చేర్పించి మానసిక చికిత్స అందించారు. రమేశ్ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన బంధువులు రమేశ్‌ను గుర్తించి తీసుకెళ్లారు.

News August 2, 2024

విశాఖ నేతలను కాదని..!

image

విశాఖ స్థానిక సంస్థల MLC వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడితో పాటు సీనియర్ నేత కోలా గురువులు తదితరుల పేర్లు మొదటి నుంచి బలంగా వినిపించాయి. అనూహ్యంగా విశాఖ నేతలను కాదని విజయనగరం నేతకు ఆ అవకాశం దక్కడంతో అందరూ ఖంగు తిన్నారు. అప్పట్లో బొత్స సతీమణి ఝాన్సీకి సైతం విశాఖ ఎంపీగా జగన్ అవకాశం ఇవ్వడం గమనార్హం.

News August 2, 2024

భారీ వర్షాల కారణంగా దంతేవాడ వరకే కిరండూల్ రైలు

image

భారీ వర్షాల కారణంగా విశాఖ-కిరండూల్ మధ్య నడిచే పలురైళ్లు గమ్యాలు కుదిస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 1 నుంచి 7 వరకు విశాఖ-కిరండూల్(08551) పాసింజర్ స్పెషల్, విశాఖ-కిరండూల్ (18514) ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఈనెల 2 నుంచి 8 వరకు కిరండూల్-విశాఖ (08552) పాసింజర్ స్పెషల్, కిరండూల్-విశాఖ (18513) ఎక్స్‌ప్రెస్ దంతెవాడ వరకు నడవనున్నట్లు తెలిపారు.

News August 2, 2024

విశాఖ: కానిస్టేబుల్ మీద దాడి చేసిన వ్యక్తిపై రౌడీషీట్

image

ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 29వ తేదీ రాత్రి పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కె.వినయ్ పై రౌడీషీట్ తెరిచినట్లు సీఐ సంజీవరావు తెలిపారు. ఇప్పటివరకు వినయ్ పై 9 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. దాడి చేసిన తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. అతడిని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

News August 2, 2024

దంతేవాడ వరకు మాత్రమే కిరండూల్ రైలు

image

ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు కిరండూల్ రైలు దంతేవాడ వరకే నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో ఏజెన్సీలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని వారు కోరారు.

News August 1, 2024

విశాఖ పోర్టు మరో రికార్డు

image

మాంగనీస్ దిగుమతిలో విశాఖపట్నం పోర్టు మరో రికార్డును సొంతం చేసుకుంది. జులైలో 17 నౌకల ద్వారా 5,66,301 మెట్రిక్ టన్నుల మాంగనీసు దిగుమతి చేసినట్లు పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. విశాఖ పోర్ట్‌కు ఇదో మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. దీనిపై పోర్టు ఛైర్మన్ అంగముత్తు హర్షం వ్యక్తం చేశారు. పోర్టు సిబ్బందికి అభినందనలు తెలిపారు.

News August 1, 2024

విశాఖ: తనికెళ్ల భరణికి జీవన సాఫల్య పురస్కారం

image

రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారం లభించింది. గురువారం విశాఖ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయనకు పురస్కారాన్ని అందజేయడంతో పాటు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు బాదంగీర్, దర్శకుడు భాష, యువ నటుడు సతీశ్ కుమార్, బుద్దాల వెంకట రామారావు, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

News August 1, 2024

లోక్ సభ ప్రజాపద్దుల కమిటీలో అనకాపల్లి ఎంపీకి చోటు

image

లోక్ సభ ప్రజాపద్దుల(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) కమిటీలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు చోటు లభించింది. 15 మంది సభ్యులతో 18వ లోక్ సభలో ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు అయింది. కమిటీ ఛైర్మన్‌గా రాహుల్ గాంధీ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి చోటు లభించింది. సీఎం రమేశ్ గతంలో కూడా రాజ్యసభ నుంచి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పని చేశారు.