India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీజేపీ కూటమిలో భాగంగా విశాఖ నార్త్ సీటుకి విష్ణుకుమార్ రాజు పేరును ప్రకటించింది. ఈయన 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి గెలుపొందగా, 2019లో ఓడిపోయారు. 2014లో 18,240 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నియెజకవర్గంలో నమోదు అయిన అత్యధిక మెజారిటీ ఇదే కావడం విశేషం. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, జనసేన , టీడీపీ కూటమిలో భాగంగా మరోసారి బరిలో నిలుస్తున్నారు.
సింహాచలం వరాహ లక్ష్మి నృసింహ ఆలయాన్ని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న సుదర్శన నరసింహ మహా యజ్ఞంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో పూజలు చేశారు. అనంతరం స్వామీజీలను వేద పండితులు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి సత్కరించారు.
విజయవాడ నుంచి ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సి విజిల్ ఫిర్యాదులు పరిష్కారం ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ తదితరులు ఎన్నికల నిర్వహణపై వివరించారు.
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో అడ్మిషన్ల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వర్సిటీ గాజువాక స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ఎస్వీ కృష్ణ తెలిపారు. యూనివర్సిటీ అందిస్తున్న అన్ని సర్టిఫికెట్, డిప్లమా, పీజీ డిప్లమా, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎంబీఏ ప్రవేశాలకు అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 0891-3514734 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.
ఈనెల 31న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసందే. మ్యాచ్‌కు సంబంధించి ఈరోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఓపెన్ అయిన గంటలోపే వెయ్యి, రూ.2వేలు, రూ.3వేలు, రూ.4 వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోగా.. మ.12.30కి మొత్తం టికెట్లు అయిపోయాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ధోనీ క్రేజ్ వల్లే టికెట్లు త్వరగా అయిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు.
గాజువాక ఆటోనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్ ఎస్ బ్లాక్‌లో టీపీఎల్ ప్లాస్టిక్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గణేష్ (31) నేలబావిలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్‌కు హాజరుకాని 315 మంది ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఇన్ ఛార్జ్, ఆర్.ఐ.ఓ మురళీకృష్ణ తెలిపారు. రోజుకు రూ.1000 చొప్పున కళాశాల యాజమాన్యాలకు జరిమానా విధిస్తామని తెలిపారు. మూల్యాంకనానికి ప్రైవేట్ కార్పొరేట్, కళాశాలల అధ్యాపకులను వెళ్ళనీయకుండా యాజమాన్యాలు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢీల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపై లక్షల్లో అప్పు ఉందని ప్రజాశాంతి పార్టీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. మంగళవారం విశాఖ రైల్వే న్యూ కాలనీ వద్దగల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… తాను ఎంపీగా పోటీ చేద్దామని బీజేపీలో చేరితే మోసం చేశారని అన్నారు. అందుకే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎంపీగా కేఏ పాల్‌ను గెలిపించాలన్నారు.
లింక్ రైళ్లు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పలు రైళ్లను రీ షెడ్యూలు చేసినట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం త్రిపాఠి తెలిపారు. విశాఖ-బెనారస్ రైలు ఈనెల 27న తెల్లవారు జామున 4 గంటల 20 నిమిషాలకు బదులు ఉ.7 గంటల 10 నిమిషాలకు, విశాఖపట్నం-పాట్నా హోలీ ప్రత్యేక రైలు ఈనెల 27న ఉ.9.25 గంటలకు బదులు 11.30 గంటలకు వెళ్లేలా మార్పులు చేశామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.