India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర జరుగుతుందంటూ.. సోషల్ మీడియాలో జరగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. ఆ సిరాను ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
విశాఖ నగరంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తరలిస్తున్న నగదు పట్టివేత కలకలం రేపింది. సుమారు రూ.కోటిన్నర నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలతో ఈ నగదు వ్యవహారం బయటపడింది. విశాఖ ఆర్కే బీచ్‌కు సమీపంలో పాండురంగపురంలోని కారులో తరలిస్తున్న రూ.కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. సీ-విజిల్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకవరపాలెం మండలం, తూటిపాల గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు రవికుమార్ అద్భుతాన్ని సృష్టించాడు. 624 తోటకూర గింజలతో తల్లీబిడ్డల చిత్రాన్ని రూపొందించాడు. చిత్రం మధ్యలో అమ్మ గురించి, గొప్పతనం తెలుపుతూ సూక్ష్మ లిపిలో రాశాడు. ఇలా రూపొందించడానికి తనకు 10 గంటల సమయం పట్టినట్లు ఆయన తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పేర్కొన్నారు. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెంచేందుకు గ్రామస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈసారి 85శాతం వరకు పోలింగ్ పెంచే లక్ష్యం మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. ముందుగా లోక్ సభకు, తరువాత అసెంబ్లీ స్థానానికి ఓటు హక్కు కల్పిస్తున్నామన్నారు.
ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో 12,89,371 మంది ఓటు హక్కు వినియోగించు కోనున్నారని కలెక్టర్ రవి పేర్కొన్నారు. వీరి కోసం 1529 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 340 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, వాటిలో 380 మంది సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పీఓలు 1750, ఏపీఓలు,1743, ఓపీఓలు 7036 మంది విధుల్లో ఉంటారని చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేశామన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న రుషికొండలోని బ్లూ బ్లాగ్ బీచ్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి ఓ ప్రకటనలో తెలిపారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ లో విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కార్మికులు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సెలవు మంజూరు చేసినట్లు తెలిపారు. పర్యాటకులు ఎవరూ ఆరోజు బ్లూ ఫ్లాగ్ బీచ్‌కు రావద్దని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కార్మిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంస్థలు, కంపెనీలు, ఉద్యోగులకు కార్మికులకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.
ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ (63003 10152), పోలీసు పరిశీలకులు అమిత్ కుమార్ (63003 15841), వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ (63003 01726), ఎస్.కోట, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు సీతారామ్ జాట్ (63003 20829), భీమిలి, తూర్పు, దక్షిణ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌమ్య (63003 16752)గా తెలిపారు.
విశాఖ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూ.21 కోట్లు విడుదలయ్యాయి. 2019లో జరిగిన ఉమ్మడి విశాఖ ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, అనకాపల్లి, విశాఖ, అరకు పార్లమెంట్ స్థానాల ఉండటంతో ఎన్నికల నిర్వహణకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత విశాఖ పరిధి తగ్గింది. దీంతో విశాఖలో ఎన్నికల నిర్వహణకు నిధులు విడుదల కూడా తగ్గింది.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగిసింది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సి ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
Sorry, no posts matched your criteria.