India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ జంతు ప్రదర్శన శాలలో వన్యప్రాణుల మృత్యువాత ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి చనిపోతుండడం జూలో కలకలం రేపుతోంది. కార్డియో పల్మనరీ వ్యవస్థ విఫలమవ్వడంతో తాజాగా జిరాఫీ మృతి చెందింది. గత నెలలో ఆడ చింపాంజీతో కలుపుకొని కొద్ది నెలల్లోనే ఎనిమిది వరకు చనిపోయాయి. వరుసగా చోటుచేసుకుంటున్న వీటిని చూస్తుంటే జంతువుల సంరక్షణపై అనుమానం కలుగుతోంది. నిజంగా వాటి మృతికి వయసు మీరడమే కారణమా అన్నది సందేహంగా మారింది.
సింహాచలంలో అప్పన్న స్వామి డోలోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. స్వామివారికి పిల్లని ఇవ్వాలంటూ సోదరి పైడితల్లమ్మ అమ్మవారిని అర్ధించే తంతు పూర్తిచేశారు. ఈ విధానాన్ని స్వామివారి పెళ్లిచూపులు(డోలోత్సవం) అంటారు. అనంతరం వారికి పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే నెల 9న ఉగాది రోజు పెండ్లిరాట, 19వ తేదీన చైత్ర ఏకాదశిన పురస్కరించుకొని వార్షిక కల్యాణోత్సవానికి స్వామివారు సిద్ధమవుతున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం వైర్ రాడ్ మిల్ (WRM) -2 విభాగంలో 2023-24 ఏడాదికి రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. విభాగం ప్రారంభం నాటి నుంచి పరిశీలించగా, ఈ ఏడాది 6 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి సాధించి నిర్ణీత సామర్థ్యాన్ని అధిగమించినట్లు వివరించారు. విభాగం అధికారులను, ఉద్యోగులను ఉక్కు సీఎండీ అతుల్ భట్, డైరెక్టర్ (ఆపరేషన్స్ ప్రాజెక్ట్) అభినందించారు.
విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో ఆదివారం మగ జిరాఫీ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో కోల్ కతా అలీపూర్ జూ పార్క్ నుంచి రెండు జిరాఫీలను ఇక్కడకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు జూ క్యూరేటర్ నందిని సలారియ తెలిపారు. దీనికోసం సెంట్రల్ జూ అథారిటీకి ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. వాటిని తీసుకురావడానికి త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
యూకే డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ విశాఖ నగరానికి మంగళవారం వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 10 గంటల 50 నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని స్థానిక అధికారులు తెలిపారు. తిరిగి బుధవారం రాత్రి 8 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారని అన్నారు.
విశాఖ బీచ్ రోడ్డులోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంతంలో ఓ కణుజు సోమవారం సంచరించింది. చెంగు చెంగున గంతులేస్తూ కొంత సమయం పాటు రహదారిపై అటూ ఇటూ తిరిగి సమీప జూపార్కు జాజాల గుమ్ము వైపు ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రయాణికులు ఆసక్తిగా ఈ దృశ్యాన్ని వీక్షించారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఇలాంటి మూగ జీవాలు గత కొంతకాలంగా తరచూ బయటకొచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి.
భారత్, యూఎస్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతానికి నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్–2024లో భాగంగా మంగళవారం నుంచి సీ ఫేజ్ విన్యాసాలు ప్రారంభంకానున్నాయి. ఈఎన్‌సీ ప్రధాన కేంద్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరగాయి. మంగళవారం నుంచి ఈ నెల 31 వరకు భారత్, యూఎస్ దేశాలకు చెందిన త్రివిధ దళాలు సీ ఫేజ్ విన్యాసాలు చేయనున్నాయి.
విశాఖ పోర్టు 90 ఏళ్ల చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 72.01 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసిన పోర్టు.. ఈ ఆర్థిక సంవత్సరం 2023–24 ముగియకుండానే పోర్టు 79 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. సరుకు హ్యాండ్లింగ్‌లో కూడా గత ఏడాదితో పోల్చితే సోమవారంతో 73,52,899 టన్నులు అధికంగా హ్యాండ్లింగ్ చేసింది.
అనకాపల్లి ఎంపీ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ను ఖరారు చేయగా.. వైసీపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో కాపు, గవర సామాజిక వర్గాలదే పైచేయి. అయితే ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.. వైసీపీలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. మరి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారని మీరు భావిస్తున్నారు..?
సాధరణంగా జనావాసంలో ఉన్న పెద్ద చెట్లకు 5 వరకు తేనెపట్లు ఉంటాయి. అదే అటవీ ప్రాంతాల్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అల్లూరి జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. డుంబ్రిగూడ మండలం కొర్రాయి కొత్తవలస గ్రామంలో జనావాసాలను ఆనుకుని ఉన్న ఓ భారీ చెట్టు నిండుగా తేనెపట్లే ఉన్నాయి. ప్రతి కొమ్మకూ తేనెపట్లు ఉంటూ.. మొత్తంగా 100కు పైగా తేనెపట్లు ఉండటం విశేషం.
Sorry, no posts matched your criteria.