India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనకాపల్లి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ కేవీ మురళీకృష్ణలతో కలిసి పోలీసు అధికారులతో శాంతిభద్రతల నిర్వహణపై చేపడుతున్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి డిఎస్పీ స్థాయి అధికారిని నియమించామన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ కార్యక్రమం 94% పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున తెలిపారు. మిగిలిన వారికి ఈరోజు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తామని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఓటర్ స్లిప్ తీసుకోని వారు ఓటర్ జాబితాలో పేరు ఉంటే పోలింగ్ రోజు స్లిప్పు తీసుకుని నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, పోలింగ్ కేంద్రం వద్ద వీటికి ఏర్పాటు చేశామన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున శుక్రవారం సందర్శించారు. జిల్లాలోని క్లిష్టతరమైన పోలింగ్ కేంద్రాల్లో అమర్చుతున్న వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటికే ఎన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్ని చోట్ల ఏర్పాటు చేయాలి అనే విషయమై అధికారులను ఆరా తీశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలులోకి వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. నలుగురు కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడటానికి వీలులేదని ఆయన గుర్తు చేశారు. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి తమ ప్రచారాన్ని ముగించాలని పోటీదారులకు సూచించారు. అప్పటి నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం మరో 24 గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీల నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో ఉమ్మడి విశాఖ నిత్యం వార్తల్లో నిలిచింది. మరికొన్ని గంటల్లోనే ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల డబ్బుల ప్రలోభాలకు తెరలేసింది.
విజయరామరాజుపేట సమీపంలోని బియన్ రోడ్లో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన <<13222221>>విషయం తెలిసిందే<<>>. విస్సారపు గణేశ్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలయిన మధుని 108 వాహనంలో చోడవరం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలో మధు కూడా మృతి చెందాడు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.
బుచ్చియ్యపేట మండలం విజయరామరాజుపేట సమీపంలోని బియన్ రోడ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విస్సారపు గణేశ్, శీలం మధు బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మధుకి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో చోడవరం ఆసుపత్రికి తరలించారు.
ముస్లిం మైనార్టీలకు అండగా ఎన్డీఏ కూటమి ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముస్లింల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు.
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ విశాఖ నగర మెట్రోపాలిటీ స్పెషల్ జడ్జ్ ఎం.వెంకటరమణ గురువారం తీర్పు ఇచ్చారు. 2013 అక్టోబర్ 1న దేవుడనే వ్యక్తిని నిందితులు పీ.మధు, సోమశేఖర్, అనిల్ మద్యం కోసం డబ్బులు అడిగారు. డబ్బులు లేవని చెప్పడంతో దేవుడిపై దాడి చేశారు. భార్య పార్వతి దేవుని KGHలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు ఛార్జిషీట్ వేశారు.
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వినూత్నరీతిలో ప్రచారాన్ని చేపట్టారు. ఈనెల 13న ఎన్నికల పండగలో ఓటర్లు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను ముద్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ ఈ ప్రచారాన్ని చేపట్టారు.
Sorry, no posts matched your criteria.