Visakhapatnam

News March 24, 2024

విశాఖ: ‘డాక్యుమెంట్లు లేని రూ.2లక్షలు స్వాధీనం’

image

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విజయ్ కుమార్ తెలిపారు. గాజువాక కణిత రోడ్‌కు చెందిన గంగుమల్ల ప్రమోద్ పాయకరావుపేట నుంచి యలమంచిలి వైపు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా నగదు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. 

News March 24, 2024

విశాఖ తీరంలో సోమర్సెట్… బాహుబలి నౌక!

image

భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు
బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో
విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్ సోమర్సెట్’ విశాఖ
తీరానికి చేరుకుంది. ఇది ఉభయచర
యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది.

News March 24, 2024

విశాఖ: సినీ నటి సౌమ్యశెట్టి కేసు రగడ

image

చోరీ కేసులో సినీ నటి సౌమ్యశెట్టి అరెస్ట్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. రైల్వే న్యూకాలనీలోని స్నేహితురాలు మౌనిక పుట్టింట్లో సౌమ్యశెట్టి 75 తులాల బంగారం అపహరించేదనే అభియోగంపై ఫోర్త్‌ టౌన్‌ క్రైమ్‌ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె తనను అన్యాయంగా చోరీ కేసులో ఇరికించారంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతోపాటు పలు యూట్యూబ్‌ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆరోపించారు.

News March 24, 2024

విశాఖ: షిప్‌యార్డులో బెల్జియన్‌ డ్రెడ్జర్‌కు మరమ్మతులు

image

బెల్జియన్‌కు చెందిన డ్రెడ్జర్‌కు అనుకున్న సమయం కంటే రెండు రోజుల ముందే మరమ్మతులు పూర్తిచేసి విశాఖలోని షిప్‌యార్డు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ డ్రెడ్జర్‌ 150 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు, 21,002 టన్నుల డెడ్‌ వెయిట్‌తో పాటు 15,000 క్యూబిక్‌ మీటర్ల వాల్యూమ్‌, ఒక ఫుల్డ్‌ డీపీ2 ట్రైలింగ్‌ సెక్షన్‌ అప్పర్‌ కలిగి ఉంది. షిప్‌యార్డులో ఇటువంటి డ్రెడ్జర్‌కు మరమ్మతులు చేయడం ఇదే తొలిసారి.

News March 24, 2024

విశాఖ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయ కళాశాల జంక్షన్ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో మధురవాడ ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ కొండల జస్వంత్ (22) మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 24, 2024

సింహాచలం సింహాద్రి అప్పన్నకు రేపు పెళ్లి చూపులు

image

సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్టింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.

News March 24, 2024

కలెక్టరు కార్యాలయంలో ఎన్నికల గ్రీవెన్స్ కేంద్రం ఏర్పాటు

image

అనకాపల్లి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికల గ్రీవెన్స్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమాండ్ కంట్రోల్ కేంద్రం నోడల్ అధికారి, మత్సశాఖ డి.డి పి.ప్రసాదు తెలిపారు. అలాగే ఇప్పటికే అందుబాటులో వున్న టోల్ ఫ్రీ నం.1950 కూడా అందుబాటులో వుంటుందని చెప్పారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి గ్రీవెన్స్ తెలియజేయడానికి 24 గంటలు అందుబాటులో వుంటుందని తెలిపారు.

News March 23, 2024

విశాఖ: 24 నుంచి ఐపీఎల్ టికెట్లు విక్రయాలు

image

విశాఖ వైఎస్సార్ స్టేడియంలో ఈనెల 31, వచ్చేనెల 3న నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్ లైన్‌లో విక్రయించనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది. 27 నుంచి పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ ఢిల్లీ క్యాపిటల్స్ వెబ్సైట్లో ద్వారా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. పీఎం పాలెం స్టేడియం బి గ్రౌండ్, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో రెడీమ్ చేసుకోవచ్చునని చెప్పింది.

News March 23, 2024

విశాఖ: పుట్టెడు దుఃఖంతో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

image

పదో తరగతి పరీక్ష రాస్తున్న దేశగిరి యమునకు పుట్టెడు దుఃఖం కలిగింది. జీకే వీధికి చెందిన యమున తల్లి సరస్వతి మృతిచెందిన సమాచారం తండ్రి కేశకర్ణ చేరవేశారు. రక్తపోటు అధికమై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పరీక్ష రాసి స్వగ్రామం దేవరపల్లిలో తల్లి అంత్యక్రియలకు విచ్చేసిన యమున బోరున విలపించింది. దీంతో గ్రామాల్లో విషాదఛాయలు అనుముకున్నాయి.

News March 23, 2024

పాడేరుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

2019 ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీకి సంబంధించి తక్కువగా (62 శాతం) పోలింగ్ నమోదు కావడంతో ఈ దఫా పోలింగ్ శాతం పెంపునకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. అల్లూరి జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని తెలిపారు. అన్ని ప్రధాన జంక్షన్లు, పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.