Visakhapatnam

News July 27, 2024

విశాఖ-కిరండూల్-విశాఖ రైలు దారి మల్లింపు

image

భారీ వర్షానికి ట్రాక్ పై బండరాళ్లు పడవచ్చుననే కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్‌‌ను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ – కిరండూల్ నైట్ ట్రైన్(18514) ఈ నెల 27 నుంచి 31 వరకు విజయనగరం, రాయగడ మీదుగా కిరండూల్ చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణం కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్(18513) ఈ నెల 28 నుంచి ఆగష్టు 1వ తేదీ వరకు కిరండూల్ నుంచి రాయగడ, విజయనగరం మీదుగా విశాఖ చేరుతుందన్నారు.

News July 27, 2024

విశాఖ: పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించిన సీపీ

image

ఈ నెలలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు 81 మందికి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ రివార్డులు అందించారు. నగరంలో శనివారం నెలవారీ క్రైమ్ రెవ్యూ నిర్వహించారు. గంజాయి రవాణా, చోరీ సొత్తు రికవరీ తదితర సంఘటనలలో ప్రతిభ కనపర్చిన వారికి ప్రతి నెలా రివార్డులు అందజేసి వారిని ప్రోత్సహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

News July 27, 2024

విశాఖ: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

image

సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని అమ్మాయిల ఫొటోలు ఎరగా చూపి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ వాసి కె.లోకేశ్‌ను అరెస్టు చేసినట్లు విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్ తెలిపారు. ఆ వ్యక్తి మాయలో నగరానికి చెందిన ఓ వ్యక్తి రూ. 28 లక్షలు పోగొట్టుకున్నాడని ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. కేసులో సంబంధం ఉన్న మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

News July 27, 2024

విశాఖ: ఆగస్టు 1న పలు రైళ్లు రీ షెడ్యూల్

image

పూండి-నౌపడ సెక్షన్లో పలు రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆగస్టు 1న భువనేశ్వర్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(12830) గంట ఆలస్యంగా మ.1.10 గంటలకు, ఆగస్టు 3న పూరీ-గాంధీధాం (22974) గంటన్నర ఆలస్యంగా మ.12.45 గంటకు, భువనేశ్వర్-తిరుపతి (22879) గంట ఆలస్యంగా మ.1.10 గంటకు బయలుదేరుతుంది. ఈ నెల 29, ఆగస్టు 1,3 తేదీల్లో విశాఖ-పలాస-విశాఖ మాత్రమే రాకపోకలు సాగిస్తుంది.

News July 27, 2024

బ్రిక్స్‌లో భారత్‌ ప్రతినిధిగా విశాఖ అమ్మాయి

image

రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్‌తో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. పెందుర్తిలోని నీలకంఠపురానికి చెందిన షేక్ ఆయేషా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PHD చేస్తున్నారు. దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏకైక తెలుగు అమ్మాయి కావడం విశేషం.

News July 27, 2024

బ్రిక్స్‌లో భారత్‌ ప్రతినిధిగా విశాఖ అమ్మాయి

image

రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్‌తో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. పెందుర్తిలోని నీలకంఠపురానికి చెందిన షేక్ ఆయేషా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PHD చేస్తున్నారు. దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏకైక తెలుగు అమ్మాయి కావడం విశేషం.

News July 27, 2024

విశాఖ: ‘సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి’

image

ఉద్యోగులు సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలని ఇన్కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ శేషగిరిరావు సూచించారు. విశాఖ నగరం దొండపర్తి డీఆర్ఎం కార్యాలయంలో పన్ను చెల్లింపుదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు పాల్గొన్నారు.

News July 26, 2024

ఎంబీఏ, ఎంసీఏ సెల్ఫ్ సపోర్ట్ ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం

image

ఏయూలో ఎంబీఏ, ఎంసీఏ ఫుల్ టైం కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ డి.ఏ నాయుడు తెలిపారు. 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 14న కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఎంబీఏకు ఏడాదికి రూ.1.5 లక్షలు, ఎంసీఏకు రూ.1.25 లక్షలు ఫీజుగా చెల్లించాలని తెలిపారు. ఏపీ ఐసెట్ ర్యాంకులు సాధించిన వారు తమ దరఖాస్తులను ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో అందజేయాలి.

News July 26, 2024

విశాఖలో కేజీ టమాటా రూ.38 మాత్రమే

image

విశాఖపట్నంలో 13 రైతు బజార్లో జేసీ కె.మయూర్ అశోక్ ఆదేశాలనుసారం వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రూ.38కే టమాటా విక్రయాలు జరిగాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. ఐదు రోజులుగా ధర తగ్గుతూ వస్తుండడంతో రైతు బజార్లో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

News July 26, 2024

బోసిపోతున్న పర్యాటక కేంద్రాలు

image

అల్లూరి జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాలు బోసిపోతున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీలో గడిచిన రెండు వారాలుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన అరకు, బొర్రా, చపారాయి, కొత్తపల్లి, వంజంగి హిల్స్ పర్యాటక కేంద్రాలు నిత్యం వందలాది మంది పర్యాటకుల సందర్శనతో కళకళ ఉండేవి. ప్రస్తుతం వాతారణం అనుకూలించకపోవడంతో పర్యాటకులు రావడం లేదు. దీంతో కళాహీనంగా దర్శన మిస్తున్నాయి.