India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్షాల వల్ల పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఆదివారం బయలుదేరాల్సిన విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్, విశాఖ లోకమాన్య తిలక్, విశాఖ మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్, మహబూబ్ నగర్ విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్, సికింద్రాబాద్-హౌరా ఫలక్ నామాను రద్దు చేశారు.
విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ఆదివారం రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్ పరిధిలో రాయనపాడు రైల్వే స్టేషన్‌లో వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా ఈ ట్రైన్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో భారీ వర్షాల వల్ల ఆర్టీసీ విశాఖ రీజియన్ రూ.1.35 కోట్ల మేర ఆదాయం కోల్పోయింది. ప్రయాణికులు బాగా తగ్గడంతో ఆక్యుపెన్సీ, రోజువారీ ఆదాయం పడిపోయాయి. సాధారణ రోజుల్లో ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు 72 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో రూ.95 లక్షలు ఆదాయం వస్తుంది. భారీ వర్షాల కారణంగా బుధవారం రూ.70 లక్షలు, గురువారం రూ.65 లక్షలు, శుక్రవారం రూ.53 లక్షలు, శనివారం రూ.57 లక్షలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
విశాఖ రేంజ్ పరిధిలో 15 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి శనివారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. అచ్యుతాపురం యూపీఎస్ సీఐ ఎం.బుచ్చిరాజును రేంజ్ వీఆర్‌కు, పాడేరు యూపీఎస్ సీఐ డీ.నవీన్ కుమార్‌ను అల్లూరి సీతారామరాజు జిల్లా సీసీఎస్‌కు, ఏఎస్ఆర్ జిల్లా సీసీఎస్ సీఐ వెలగాడ శంకరనారాయణను రేంజ్ వీఆర్‌కు, రేంజ్ వీఆర్‌లో ఉన్న పీ.పైడపునాయుడును కే.కోటపాడుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అకడమిక్ ఇయర్ కోర్సుల్లో చేరే విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి అపరాధ రుసుము చెల్లించకుండా ఫీజులు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు ఏయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ మోహన్ తెలిపారు. నవంబరు 15 వరకు ఫీజులు చెల్లించేందుకు గడువు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వాహన చోదకులారా.. తస్మాత్ జాగ్రత్త.. నిబంధనలు పాటించండి, రోడ్డు ప్రమాదాలు నియంత్రించండి అంటూ సిటీ పోలీస్‌లు అప్రమత్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి గానీ, వెనుక కూర్చున్న వ్యక్తి గానీ, వాహనంపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు BIS మార్క్ కలిగిన హెల్మెట్ ధరించాలి. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ ధరించవలెను.
CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో జిల్లాలోని విద్య, వైద్య రంగ సేవలను మరింత విస్తృతం చేద్దామని విశాఖ కలెక్టర్ పేర్కొన్నారు. దీనికి పారిశ్రామికవేత్తలంతా మంచి మనసుతో ముందుకు రావాలని, పూర్తి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిధులను వెచ్చించాలని సూచించారు. శనివారం వారితో కలెక్టరేట్లో సమావేశం అయ్యారు.
భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని కలెక్టర్‌లకు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
జిల్లాలో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్‌గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉన్న గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ నదులు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ రోడ్డుపై వరద నీరు ఉంటే చూసి రాకపోకలు సాగించండి
➤ మ్యాన్ హోళ్ల వద్ద జాగ్రత్తగా ఉండండి
➤ విశాఖ కంట్రోల్ రూమ్ నెం. 1800 4250 0002, అనకాపల్లి 08924 226599
విశాఖ నగరంలో శనివారం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్ల పాలెంలో ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు కలెక్టర్ హరీంధర ప్రసాద్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభారాణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.