India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఆయన కసింకోట మండలం తాళ్లపాలెం సమీపంలో జరిగే ప్రచార సభలో పాల్గొన్నారు. సాయంత్రం 5:30కు ఆయన సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. తిరిగి 7:10కి విశాఖ ఎయిర్పోర్ట్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే అధికారులు భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే పీఓలు, ఏపీవోలతో పాటు ఇతర అధికారులు ఈవీఎంల వినియోగంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలోని ఆదివారం జరిగిన పశ్చిమ నియోజకవర్గ ఈవీఎంల కమిషనర్ ప్రక్రియను ఆర్ఓ హుస్సేన్ సాబ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
విశాఖలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు సమన్వయకర్త ఈశ్వరి ప్రభాకర్ తెలిపారు. ఈ పరీక్షకు 8,038 మంది దరఖాస్తు చేసుకోగా 7,861 మంది హాజరయ్యారని వివరించారు. ఇందులో 5,800 మంది బాలికలు కాగా 2,061 మంది బాలురు ఉన్నారని తెలిపారు. నగరంలో మొత్తం 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఆమె వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.
జీవీఎంసీ 77వ వార్డు పరిధిలో సగం విశాఖపట్నం జిల్లా, మరో సగం అనకాపల్లి జిల్లా పరిధిలో ఉంది. జిల్లాల పునర్విభజనలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించారు. అయితే విలీన పంచాయతీలు మాత్రం విశాఖ జిల్లాలోనే ఉంచారు. ఈ ప్రాంతంలో ఓటర్లు పెందుర్తి అసెంబ్లీకి, అనకాపల్లి పార్లమెంటుకు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ నివసించేది మాత్రం విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం. ఈ ప్రాంతం గాజువాక జోన్ పరిధిలో ఉంది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 13 నుంచి 24 వరకు ప్రతి సోమవారం రాత్రి 9 గంటలకు సంబల్పూర్‌లో బయలుదేరి దువ్వాడ మీదుగా కాచిగూడ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి 25 వరకు ప్రతి మంగళవారం కాచిగూడలో రాత్రి 11 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా సంబల్పూర్ చేరుకుంటుందన్నారు.
అరకు లోక్‌సభ 2019 ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, ఆ తర్వాతి స్థానంలో అరకులో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘జనరల్ ఎలక్షన్స్ 2019: యాన్ అట్లాస్’లో పేర్కొంది.
గాజువాకలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక జింక్ గ్రౌండ్లో వాకర్స్, క్రీడాకారులను ఆదివారం కలుసుకున్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆయన మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో క్రీడాకారులు అధికంగా ఉన్నారని, వీరిని ప్రోత్సహించేందుకు గాజువాకలోని ఓపెన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు.
విశాఖలోని RK బీచ్ నుంచి YMCA వరకు వాక్ చేస్తూ శ్రీభరత్, తేజస్విని, వెలగపూడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ MP అభ్యర్థిగా శ్రీభరత్ ను గెలిపించాలని కోరారు. అనంతరం వారు RK బీచ్‌లో వాలీ బాల్ ఆడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఏపీ భవిష్యత్ బాగుపడాలంటే కూటమిని గెలిపించాలని కోరారు.
భానుడి ప్రతాపానికి భగభగలాడిన విశాఖ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. విశాఖ , అనకాపల్లి జిల్లాలో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఆదివారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. 5వ తేదీ నుంచి 8 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆదివారం పీఓలు ఏపీఓలకు, 6న ఓపీఓలకు ఓటింగ్ ఉంటుందన్నారు.. ఈ మేరకు ఏయూ తెలుగు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల ఆవరణలో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.