India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ జిల్లా భీమిలి వద్ద MP విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ కూల్చి వేయాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై మరొకరు వేసిన పిల్ విచారణకు రావడంతో.. దాంతో నేహారెడ్డి పిటిషన్ జత చేయాలని కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని అధికారులకు సూచించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రహరీ నిర్మించారని సమాచారం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌కు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఐదు ఘాట్ రోడ్లలో శనివారం నుంచి భారీ వాహనాలు, బస్సులు, ప్రైవేటు జీపుల రవాణాను సాయంత్రం 7నుంచి ఉదయం 6గంటల వరకు నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వడ్డాది-పాడేరు ఘాట్, పాడేరు-చింతపల్లి, కొక్కరాపల్లి ఘాట్, డౌనూరు, లంబసింగి ఘాట్, రంపచోడవరం-చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్లలో నిషేధ ఉత్తర్వులు పక్కాగా అమలు చేయాలన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో MED, MPED 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఫలితాలను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫలితాల కోసం ఏయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కోయంబత్తూరు-దానాపూర్ మధ్య ఒక వైపు ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. ఈనెల 21వ తేదీ రాత్రి 11.30 గంటలకు కోయంబత్తూరులో బయలు దేరి మర్నాడు రాత్రి 8.10 గంటలకు దువ్వాడ చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 8.15 గంటలకు బయలుదేరి దానాపూర్ వెళ్తుందన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో MCA 4వ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 12,13 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు. పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆగస్టు 12న డేటాసైన్స్, ఆగస్టు 13న సెలెక్టివ్-2 గా ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ కంప్యూటింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం మహా విశాఖ నగరపాలక సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ.1.69 కోట్లు, ప్రజారోగ్య విభాగం నుంచి రూ.16లక్షలు మొత్తం 1.85కోట్లు వెచ్చిస్తున్నారు. ఇన్ఛార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశాల మేరకు ప్రధాన ఇంజినీరు రవి కృష్ణంరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేశ్ కుమార్ ఏర్పాట్లు చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ 4వ సెమిస్టర్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) జె.రత్నం తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏయు ప్రియదర్శిని సర్వీస్ ఆర్గనైజేషన్‌లకు ఏయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వారం రోజుల ముందుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని తమకు కేటాయించిన కేంద్రంలో పరీక్షకు హాజరవ్వాలి.
ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఈనెల 21న అప్పన్న ఆలయంలో దిల్లీ విజయోత్సవం నిర్వహించనున్నారు. భగవత్ రామానుజులు దిల్లీ బాదుషాను పాండిత్యంలో మెప్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని జరపడం ఆలయ సంప్రదాయంగా వస్తుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు భక్తుల దర్శనాలను నిలిపివేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
ఏయూలో గతంలో ఏర్పాటు చేసిన ఇనుప బారికేట్లను, గేట్లను తొలగించడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఏయూ పరిపాలన భవనంలోకి విద్యార్థులు రాకుండా గతంలో ఏర్పాటు చేసిన ఇనుప అడ్డంకులను తొలగించినందుకు ఇన్‌ఛార్జ్ వీసీ ఆచార్య శశిభూషణ్ రావును ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. బారికేడ్లు, దిగ్బంధం రోజులు పోయాయని మార్పు ప్రారంభమైందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.