India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పరిధిలోని హాస్టల్స్ కు ఈనెల 11వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ జి.వీర్రాజు నోటీసులు జారీ చేశారు. విద్యార్థులు వసతి గృహాలను ఖాళీ చేసి, సెక్యూరిటీ గార్డులకు స్వాధీనం చేయాలని దాంట్లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బందోబస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఈ వసతిగృహాలను కేటాయించే అవకాశం ఉంది.
మత్స్యకారులకు చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వం చెల్లిస్తున్న జీవన భృతికి ఎన్నికల కమిషన్ అనుమతితో గురువారం నుంచి ఎన్యుమరేషన్ ప్రారంభించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 61 రోజులపాటు సముద్ర జలాల్లో చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం జీవో ద్వారా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిషేధ కాలంలో వారికి ప్రభుత్వం జీవనభృతిగా రూ.10 వేలు అందిస్తుంది.
సింహాచలం అప్పన్న బాబు చందనోత్సవ కార్యక్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తెలిపారు. ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని చందనోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అదనంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాఖ జిల్లాలో దక్షిణ నియోజకవర్గం పోలింగ్లో కాస్త భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ బరిలో 16 మంది అభ్యర్థులున్నారు. నోటాతో కలిపి ఈ సంఖ్య 17కు చేరడంతో రెండు బ్యాలెన్స్ యూనిట్లను వినియోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్కో ఈవీఎం యూనిట్లో 16 మంది పేర్లు మాత్రమే పెట్టవచ్చు, నోటాకు మరొక యూనిట్ అవసరం ఏర్పడుతుంది. దీనితో దక్షిణ నియోజకవర్గానికి అదనంగా 284 బ్యాలెట్ యూనిట్లు కేటాయించారు.
అనకాపల్లి జిల్లాలో ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రవి సుభాశ్ ఆధ్వర్యంలో ఎన్నికల పరిశీలకులు దల్జీత్ సింగ్ మంగత్, రాకేశ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థులు, వారి ఏజెంట్లు హాజరయ్యారు. రెండో విడతలో కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్, బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ వీవీ ప్యాట్లను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు.
అచ్చుతాపురంలో ఎన్నికల ప్రచార సభలో కన్నబాబుపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాలబాబు’ అని అన్నారు. కన్నబాబు లేఔట్ల కోసం చుట్టుపక్కల ఉన్న భూములను కబ్జా చేస్తున్నాడన్నారు. 22 ఏలో ఉన్న భూములు తన పేరు మీద మార్చుకుంటున్నారు అన్నారు. కన్నబాబు లాంటి వారు ఉంటే న్యాయం జరగదని, తను బాధ్యతగా ఉంటానని భరోసా కల్పించారు.
డుంబ్రిగుడలో దారుణ హత్య జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయంలో ప్లాస్టిక్ వినియోగ పరికరాలు సేకరించే ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. అరకు సీఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడు ఎస్.కోట మండలం రాజిపేట గ్రామానికి చెందిన బత్తిన శివ శ్రీనివాస్‌గా గుర్తింమన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సినీ నటుడు, హిందూపరం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు విశాఖ చేరుకున్నారు. ఉత్తరాంధ్రలో రేపటి నుంచి రెండు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. రేపు విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, విజయనగరం పట్టణంలో పర్యటిస్తారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు భీమిలిలోను, సాయంత్రం 6.45 గంటలకు వైజాగ్ రోడ్‌షోలో పాల్గొంటారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో అచ్యుతాపురం చేరుకున్నారు. ఎలమంచిలి కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మద్ధతుగా సాయంత్రం 3 గంటలకు అచ్యుతాపురంలో జరిగే సభలో పాల్గొననున్నారు. అక్కడ నుంచి పెందుర్తి జంక్షన్‌లో కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో 52 కేజీలు గంజాయి లిక్విడ్‌ను స్వాధీనం చేసుకొని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివ కిషోర్ బుధవారం తెలిపారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని, తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.5.5 కోట్లు ఉంటుందని, వేరే రాష్ట్రాలలో విలువ మరింత ఎక్కువ ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.