Visakhapatnam

News March 21, 2024

కూర్మన్నపాలెం: బాలికను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

image

బాలికను ప్రేమ పేరిట వేధిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. దువ్వాడ సెక్టర్-1లో ఉంటున్న డి. మణికంఠ(33) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. తొమ్మిదో తరగతి బాలిక పాఠశాలకు రాకపోకలు సాగించే సమయంలో, మణికంఠ ఆమె వెంట పడి, ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. విసిగిపోయిన బాలిక వేధింపుల విషయాన్ని ఇంట్లో చెప్పడంతో, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News March 21, 2024

పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం

image

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బుధవారం లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా నటి అనసూయ సందడి చేసారు. MP డా.సత్యవతి, వ్యవసాయ కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు, TDP పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత, TDP నాయకులు యనమల కృష్ణుడు, గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్, కాంగ్రెస్ నాయకులు జగతా శ్రీనివాస్ పలు బ్లాకులు ప్రారంభించారు. పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అనసూయ అన్నారు.

News March 21, 2024

పాడేరు: పెరుగుతున్న పసుపు ధర

image

గిరిజనులు పండించే పసుపు ధర రోజురోజుకూ పెరుగుతోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో కిలో పసుపు రూ.45 నుంచి రూ.55 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది పసుపు ప్రారంభం నుంచి రూ.80 నుంచి 140 వరకు మార్కెట్‌లో వ్యాపారులు పోటీపడి మరీ కోనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది గిరిజన సహకార సంస్థ వారపు సంతలోని కనీసం పసుపు, మిరియాల ధరలు కూడా ప్రకటన చేయలేదని, అది చేసి ఉంటే మరింత ధర పలుకుతుందని గిరిజన రైతులు చెబుతున్నారు.

News March 21, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కి షాక్

image

విశాఖ ఉక్కును విద్యుత్ బిల్లుల గండం మరింత భయపెడుతోంది. బాయిలర్ బొగ్గు కొరతతో ప్లాంట్‌లోని 315 మెగావాట్ల సొంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్‌ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.60 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ ఈపీడీసీఎల్ హెచ్చరిస్తూ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.

News March 21, 2024

విమానాలకు పక్షుల అంతరాయాన్ని నివారించేందుకు స్ప్రే డ్రోన్లు

image

విశాఖ విమానాల రాకపోకలకు పక్షులు అంతరాయాన్ని నివారించేందుకు తూర్పు నావికాదళంలో వైమానిక బృందం స్ప్రే డ్రోన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి వీటి ఆపరేషన్స్‌ చేపడుతున్నారు. తద్వార పక్షులు ఎగరనీయకుండా నియంత్రించనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేస్తే.. రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలమని భావిస్తున్నారు.

News March 21, 2024

అనకాపల్లి: ఏ.ఎల్ పురం చెక్‌పోస్టు వద్ద రూ.లక్ష సీజ్

image

గొలుగొండ మండలం ఏ.ఎల్ పురం చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో ఆధారాలు లేని రూ.లక్ష నగదు సీజ్ చేసినట్లు కృష్ణదేవిపేట ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాజవొమ్మంగి మండలం శరభవరం గ్రామానికి చెందిన నానిబాబు తన స్నేహితుడితో కలిసి కారులో వెళుతుండగా.. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేశామన్నారు. ఏ ఆధారాలు లేని రూ.లక్ష సీజ్ చేసి.. నగదును తహశిల్దార్‌కి పంపించామన్నారు.

News March 21, 2024

అల్లూరి: ‘సింగిల్ విండో విధానంలో అనుమతులు’

image

పొలిటికల్ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తామని జేసీ భావన వశిస్ట్, ITDA పీఓ వి.అభిషేక్ అన్నారు. పాడేరు కలెక్టరేట్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందాలకు ఎన్నికల పోర్టల్స్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సువిధ యాప్ నుండి దరఖాస్తులు స్వీకరించి, ఎన్‌కోర్ యాప్ నుంచి అనుమతులు జారీ చేస్తామన్నారు. రిటర్నింగ్ అధికారుల ఆమోదం లేకుండా ఎటువంటి అనుమతులు జారీ చేయకూడదన్నారు.

News March 20, 2024

విశాఖ: రైలులో ప్రసవం చేసిన 108 సిబ్బంది

image

రాయగడ నుంచి విశాఖ వచ్చిన రైలులో బుధవారం ఓ గర్భిణి ప్రసవించింది. మతిస్థిమితం లేని మహిళకు పురుటి నొప్పులు రాగా.. రైల్వే పోలీసులు 108కు సమాచారం అందించారు. స్పందించిన కంచరపాలెం 108 మెడికల్ టెక్నీషియన్ శైలజ, పైలెట్ అప్పారావు హుటాహుటిన రైలు వద్దకు వెళ్లి.. నొప్పులు ఎక్కువ కావడంతో రైలులోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లీ బిడ్డలను కేజీహెచ్‌కు తరలించారు. 108 జిల్లా కో-ఆర్డినేటర్ సురేష్ వారిని అభినందించారు.

News March 20, 2024

విశాఖ: ఐఎన్ఎస్ డేగాకు యూఎస్ యుద్ధ విమానాలు

image

భారత్‌–యూఎస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్‌ ట్రయాంప్‌–2024 విన్యాసాల్లో పాల్గొనేందుకు యూఎస్‌కు చెందిన యుద్ధ విమానాలు బుధవారం ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్నాయి. ఈ అధునాతన, బహుముఖ యుద్ధ విమానాలు భారత నావికాదళం, వైమానిక దళాలతో కలిసి విన్యాసాలు చేయనున్నాయి. భారత్, యూఎస్‌ రక్షణ రంగ సంబంధాలు మరింత పెంపొందించేందుకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు.

News March 20, 2024

నాకు ఇవే చివరి ఎన్నికలు: మాజీ మంత్రి అయ్యన్న

image

తనకు ఇవే చివరి ఎన్నికలని.. గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వాలంటూ నర్సీపట్నం నియోజకవర్గ TDP అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రజలను కోరారు. బుధవారం రామన్నపాలెం పంచాయతీ శివారు వెంకయ్యపాలెంలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.