India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మల్కాపురంలో ఈనెల 3న జరిగిన వాసు హత్య కేసు వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు పవన్ సాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు గుర్తించామన్నారు. వాసు అన్న సింహాచలం మొదటి భార్య కుమారుడు పవన్ సాయిని పిలిపించి దాడి చేశారని సీఐ తెలిపారు.

కేజీహెచ్‌లో హరే కృష్ణ మూవ్ మెంట్ టచ్ స్టోన్ ఛారిటీస్ వారి సౌజన్యంతో భోజనం నూతన భోజనం కౌంటర్‌ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. రోగుల బంధువుల కోసం భోజనం కౌంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంటెంట్ శివానంద తదితరులు పాల్గొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ సభ్యుడు సాగి విశ్వనాథరాజు అన్నారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేస్తే స్టీల్ టన్నుకు రూ.10,000 తగ్గుతుందన్నారు. ఏపీలో ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సెయిల్‌లో విలీనం చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.

పీఎం పాలెంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పీఎం పాలెం చివరి బస్‌స్టాప్ వద్ద ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుడు విజయనగరానికి చెందిన కేశల అప్పలరాజు(35)గా గుర్తించారు. పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

యలమంచిలి మాజీ MLA కన్నబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాంబిల్లిలోని ఆయన ఇంటి తలుపు గడియలు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. పూజగదిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. వీటి విలువ రూ.50వేల వరకు ఉంటుందని అంచనా. అలాగే ఓ గ్యాస్ ఏజెన్సీలో రూ.50వేల నగదు పోయినట్లు బాధితుడు పి.సంతచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీలపై ఆదివారం ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేస్తున్నామని CI సీహెచ్ నర్సింగరావు తెలిపారు.

‘విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం దగ్గరకు వెళ్దామంటే ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆరోజు అందరూ కలిసి వచ్చి ఉండుంటే, ఈరోజు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేదు కాదు’ అని dy.cm పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సోమవారం మంగళగిరి క్యాంప్ ఆఫీసులో స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతో జరిగిన సమావేశంలో అన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకుల భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయమని కార్మికులు డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న పరిణామాలను డ్రాఫ్ట్ రూపంలో కార్మిక సంఘాల నాయకుల పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.

విశాఖ కుర్రోడు నితీశ్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన నితీశ్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ-20 సీరిస్‌కు ఎంపికయ్యారు. ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్‌తో అరంగేట్రం చేశారు. టీం సభ్యుల మధ్య టీం ఇండియా క్యాప్ అందుకున్నారు. అతనితో పాటు మయాంక్ యాదవ్‌కు కూడా ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో వీరిద్దరూ టీం ఇండియా క్యాప్‌లతో ఫొటోలు తీసుకున్నారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇసుక బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. వార్డు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. గత నెల 29 నుంచి ఇప్పటివరకు 442 మంది ఇసుక బుకింగ్ చేసుకోగా 357మందికి ఏడు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేశామన్నారు. ప్రజలే ఇసుకను రవాణా చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించామన్నారు.

విశాఖ డెయిరీ అవినీతి బాగోతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం మాట్లాడారు. ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీకి మూడు లక్షల మంది పాడి రైతులు దశాబ్దాలుగా పాలు పోస్తూన్నారని, రూ.200 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ డెయిరీ చరిత్రలో ఇప్పుడు నష్టాల బాటలో ఉన్నా ఆడారి కుటుంబం మాత్రం లబ్ది పొందిందన్నారు. డెయిరీ ఆస్తులపై CBI విచారణ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.