India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ భవనాలు ప్రాంగణాల ఆవరణలో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు తీసుకున్నట్లు తెలిపారు.
టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ వచ్చిన భారత్‌లో యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టీ దంపతులు మంగళవారం కైలాసగిరిని సందర్శించారు. అక్కడి నుంచి విశాఖ అందాలను చూసి మంత్ర ముగ్ధులై ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘కైలాసగిరి నుంచి వైజాగ్ అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత ప్రాంతాన్ని సంరక్షిస్తూ మరింత అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దిన GVMCకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
అనకాపల్లి ఎంపీ సీటు ఖరారు చేసేందుకు ఇంకా సమయం ఉందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. మంగళవారం విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.
భీమిలి పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా తిరుగుతున్నారని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. ఈ మేరకు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి పూట గ్రామాలలో తిరుగుతున్నారని, అనుమానం రాకుండా ప్రజల మధ్యలో ఉంటున్నారు.. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
పెందుర్తి టికెట్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బండారుకు మద్దతుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెన్నెలపాలెం నుంచి పరవాడ వరకు పాదయాత్ర చేపట్టారు. బండారు టికెట్ ఇవ్వని పక్షంలో జనసేన అభ్యర్థికి సహకరించేది లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా చేసిన ఒక సీనియర్ నేతకు టికెట్ ఇవ్వకుండా అవమానించడం సమంజసం కాదన్నారు.
కోటవురట్ల మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఇసరపు రామకృష్ణ (25) కోటవురట్లలో మంగళవారం నాలుగు అంతస్తుల భవనం నిర్మాణ పనులు చేస్తూ అదుపుతప్పి కిందకు జారిపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతునికి మూడు నెలల క్రితమే వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
సింహాచలం ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించనున్న చందనోత్సవం పై మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఈఓ శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను వివరించారు. ముఖ్యంగా కొండపైన ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు క్యూలైన్ల ఏర్పాటు తదితర విషయాలపై అధికారులతో ఈఓ చర్చించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు.
గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో వాలంటర్లు వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసింది. ఈ విషయంపై సోమవారం ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామంలో విచారణ చేపట్టి, కలెక్టర్‌కి నివేదిక అందించారు. ఎన్నికల అధికారి జయరాం వాలంటీర్స్ ఓంకార విజయలక్ష్మి, సింగంపల్లి భవానీలను తొలగించినట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఉన్న వాలంటీర్స్ ఏ పార్టీ తరఫున ప్రచారం చేయకూడదని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను G.O.MS-24 ప్రకారం మూసివేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు మండలంలోని రవాణా శాఖ చట్టి చెకపోస్ట్‌ను కూడా మూసివేయటం జరిగిందని జిల్లా రవాణాధికారి లీలా ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఇతర రాష్ట్ర వాహనదారులు పన్నులు, పర్మిట్‌లు ఇతర సేవలను ఆన్‌లైన్‌లో తీసుకోవాలని సూచించారు.
విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో సాగర జలాల్లో భారత్ అమెరికా దేశాల మధ్య హెచ్ఎడిఆర్-హ్యుమానిటీరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ పేరుతో నేవీ విన్యాసాలు ప్రారంభమైనట్లు నేవీ అధికారులు తెలిపారు. 18న ప్రారంభమైన విన్యాసాలు సీఫేజ్, హార్బర్ ఫేజ్‌ల్లో కొనసాగుతాయన్నారు. ఇరుదేశాల అధికారులు భారత్ నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, అమెరికాకు చెందిన యుద్ధనౌక టైగర్ ట్రయాంప్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.