India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కోటవురట్ల మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల బాలికపై స్థానికంగా ఉంటున్న పాములు అనే వ్యక్తి అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి బుధవారం సందర్శించారు. ప్లాంట్ పరిస్థితిపై ఆరా తీశారు. ప్లాంట్ నిర్వహణకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రజలు విశాఖ ఉక్కును వాడాలని మంత్రి కోరారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యానారాయణ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బొత్సకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. బొత్స వెంట విశాఖ, విజయనగరం జడ్పీ ఛైర్మన్లు జల్లి సుభద్ర, మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఉత్తరాంధ్ర కీలక నేతలు ఉన్నారు.
అనకాపల్లి(D) కైలాసపురం ఆశ్రమంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ST కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. విద్యార్థుల మరణాలు, అస్వస్థతపై నివేదిక ఇవ్వాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీవీ శంకరరావు ఆదేశించారు. మరోవైపు ఆశ్రమ నిర్వాహకుడు పాస్టర్ కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. పాసా ట్రస్ట్‌ను సీజ్ చేశారు.
విశాఖ నగరం కంచరపాలెం జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈనెల 23న నిరుద్యోగ యువతకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి సీహెచ్ సుబ్బిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల్లో 750 ఖాళీలను భర్తీ చేసేందుకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 10, ఇంటర్, డిగ్రీ, డిప్లోమా ఎలక్ట్రికల్, ఫార్మసీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.
విశాఖ నగరం సింహాచలం దేవస్థానం భూ సమస్యను పరిష్కరించాలని తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన అమరావతిలో చంద్రబాబును కలిశారు. గతంలో 296 జీవోకు సంబంధించి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు తెలిపారు. మళ్లీ అదే జీవోను కొనసాగించి మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోని శాసనమండలిలో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. బొత్స చేత శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో బొత్స భేటి అవుతారు.
ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి దువ్వాడ మీదుగా హైదరాబాద్-కటక్-హైదరాబాద్ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిందని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు(07165), ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు కటక్-హైదరాబాద్ రైలు(07166) నడుస్తుందన్నారు.
వ్యభిచార కూపం నుంచి విశాఖ యువతులకు విముక్తి లభించిన ఘటన తూ.గో జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. తూ.గో జిల్లా కొవ్వూరులోని రాజీవ్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో సీఐ విశ్వం దాడి చేశారు. అక్కడ వ్యభిచారం నడిపిస్తున్న లక్ష్మిని అరెస్ట్ చేశారు. అలాగే విశాఖ, రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు యువతలను ఆమె చెర నుంచి విడిపించారు.
మంత్రి కొల్లు రవీంద్రతో విశాఖ సర్క్యూట్ హౌస్‌లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి భేటీ అయ్యారు. జిల్లాలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.