India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివిధ సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌కి సెలవు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా సెప్టెంబర్ 14న రెండవ శనివారం రోజున వర్సిటీ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఏయూలో జరగాల్సిన పలు పరీక్షలను వర్సిటీ అధికారులు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా క్యాంపస్‌కి సైతం సెలవు ప్రకటించారు.
వివిధ సంఘాల భారత్ బంద్‌కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరగాల్సిన యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో ఏయూ వెబ్‌సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. విద్యార్థులు దీనిని గమనించాలని ఆమె సూచించారు.
విశాఖ జడ్పీ భవనంలో ఈనెల 24వ తేదీన ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశాలను నిర్వహించనున్నట్లు సీఈవో ఎం.పోలినాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన సమావేశాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.
పుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. శనివారం రాత్రే ఆశ్రమంలోని పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆదివారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపేయగా అక్కడ చనిపోయారు. ఆశ్రమానికి దగ్గరలో 50 పడకల ఆసుపత్రి ఉంది. వారిని శనివారం రాత్రే అక్కడికి తీసుకెళ్లి ఉంటే బతికే వాళ్లని, సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చనిపోయారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఉమ్మడి విశాఖ జిల్లా కోటవురట్ల(M) కైలాసపట్నంలోని అనాథ ఆశ్రమంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. పాయకరావుపేట(M) అరట్లకోటకు చెందిన పాస్టర్ కిరణ్ కుమార్ ఈ ఆశ్రమం నడుపుతున్నాడు. అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఆయనపై హత్య కేసు నమోదు చేశారు. పైఫొటోలో కనపడుతున్న చిన్న రేకుల షెడ్డులోనే దాదాపు 97 మంది పిల్లలతో ఆశ్రమం నిర్వహిస్తుండగా.. దీనికి అనుమతులు లేవని సమాచారం.
కోటవురట్న మండలం కైలాసపట్నంలో అనాథాశ్రమాన్ని అధికారులు సోమవారం సీజ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ తహశీల్దార్ జగదీశ్, ఏఎస్ఐ గంగరాజు, రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. అనాథాశ్రమం నిర్వాహకుడు ఎం.కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విషాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథశ్రమంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ముగ్గురు విద్యార్థుల మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అనధికార హాస్టల్ మూసివేయాలని ఆయన ఆదేశించారు. చిన్నారుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. అస్వస్థతకు గురైన చిన్నారుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పారు.
విశాఖ పోర్టు స్టేడియంలో ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 05వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ ర్యాలీ విజయవంతం అయ్యేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
విశాఖలో నిన్న ఘరానా<<13885131>> దొంగ<<>>ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనుషులు ఇంట్లో ఉన్నప్పుడే అతను దొంగతనాలు చేస్తాడు. కిటికీ పక్కనే డోర్ ఉంటే ఈజీగా గొళ్లెం తీసి దొరికినంత దోచేస్తున్నాడు. ‘గాలి కావాలని డోర్ పక్కన ఉండే కిటీకీలు ఓపెన్ చేయకండి. మెయిన్ డోర్‌తో పాటు కిటికీలు లాక్ చేసుకోవాలి. ఇళ్లు, బీరువా తాళాలను దస్తులు కింద, గోడలపై, షూల్లో పెట్టకండి’ అని డీసీపీ వెంకటరత్నం సూచించారు.
విశాఖ KGH ఎముకల విభాగంలోని ఓ డాక్టర్‌పై అల్లూరి జిల్లా ప్రజా పరిరక్షణ కమిటీ సమన్వయకర్త దాలినాయుడు CM చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్ ఆపరేషన్లకు రోగుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. KGHకు వచ్చే రోగులను తన సొంత క్లినిక్ తీసుకెళ్తున్నారని విమర్శించారు. మరి మీకు KGHలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.