India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎంతో విశేష సాంకేతిక పరిజ్ఞానం కలిగిన INS షాల్కీ జలాంతర్గామి శుక్రవారం తూర్పు నౌకాదళానికి చేరుకుంది. ఆ జలాంతర్తామిలో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి స్థానిక అధికారులు జాతీయ జెండాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నేవీ ఉన్నత అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆనందపురం మండలం గండిగుండం గ్రామ సమీపంలో శుక్రవారం కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. హత్యా.., ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉందన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో విశాఖ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ నావేల్ కమాండ్ ఆధ్వర్యంలో నౌకాదళ సిబ్బంది అత్యంత సాహసంతో డైవింగ్ చేస్తూ నీటి లోపల జాతీయ జెండాను ఎగరవేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజలు దేశభక్తిని చాటుకున్నారు. దాని స్ఫూర్తితో ఈ సాహస కార్యక్రమాన్ని నిర్వహించామని X (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఎన్డీఏ దూరంగా ఉండగా, నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి దాన్ని ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్వో ధ్రువీకరణ పత్రం అందించారు. శాసనమండలిలో త్వరలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలను వైసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏజెన్సీ ప్రజలకు చనిపోయిన తర్వాతా డోలీ మోతలు తప్పడం లేదు. పెదబయటు మండలం బొంగరం పంచాయతీ కుంబుర్లకు చెందిన వంతల గంగమ్మ వైజాగ్ KGHలో అనారోగ్యంతో 14వ తేదీ చనిపోయింది. మృతదేహాన్ని 15వ తేదీ ఉదయం అంబులెన్సులో తీసుకెళ్లారు. ఊరికి 4 కిలోమీటర్లు దూరంలోనే డెడ్ బాడీని దింపేసి అంబులెన్సు వెళ్లిపోయింది. అక్కడి నుంచి గ్రామస్థులు డోలీలో స్వగ్రామానికి తీసుకెళ్లారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
హోంమంత్రి వంగలపూడి అనిత స్వగృహంలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనితతో పాటు కుటుంబ సభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు. వేదపండితులు పూజా క్రతవులు జరిపించారు. ఈ పూజా కార్యక్రమానికి హోంమంత్రి పలువురు మహిళలను ఆహ్వానించారు.
విశాఖ స్థానిక సంస్థల MLCగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు అదనంగా మరో పదవి వస్తుందని YCPలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలిలో లేళ్ల అప్పిరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ పదవిని బొత్సకు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. సీనియర్ లీడర్ బొత్స ప్రతిపక్ష నేతగా ఉంటే అధికార పార్టీని దీటుగా ఎదుర్కోగలరని వైసీపీ భావిస్తోందట. అదే జరిగితే జగన్‌కు లేని ప్రతిపక్ష హోదా ఆయనకు వస్తుంది.
శాసనమండలి ఎన్నిక నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. ఈ రోజు సాయంత్రం బొత్సకు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరణపత్రాన్ని అందించనున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే అవకాశం ఉంది.
చోడవరం కార్మిక శాఖ సహాయ సంక్షేమ అధికారి పీ.సూర్యనారాయణకు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఉత్తమ అధికారిగా ప్రతిభ అవార్డు లభించింది. ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. కార్మిక శాఖ అధికారికి అవార్డు లభించడం పట్ల భవన నిర్మాణ కార్మికులు, యజమానులు హర్షం వ్యక్తం చేశారు.
పాడేరు: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున శుక్రవారం జరగబోయే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎస్.దినేశ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మీకోసం కార్యక్రమం రద్దు చేసినందున ప్రజలు గమనించి ఫిర్యాదులు అందజేయడానికి రావద్దని కలెక్టర్ సూచించారు.
Sorry, no posts matched your criteria.