Visakhapatnam

News August 15, 2024

అల్లూరిలో 78 ఏళ్ల తర్వాత తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జామిగూడ పంచాయతీ కేంద్రంలో తొలిసారి జెండా ఎగరవేశారు. స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రజలు కలిసి జామిగూడలో జెండా వందనం చేశారు. స్వాతంత్రం సిద్ధించి తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగడంతో పండగ వాతావరణం నెలకొంది. మావోయిస్టు ఆంక్షలతో ఇప్పటివరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు.

News August 15, 2024

కేజీహెచ్‌లో నిలిచిపోయిన అత్యవసర సేవలు..!

image

జూనియర్ డాక్టర్ల ఆందోళనల నేపథ్యంలో కేజీహెచ్‌లో అత్యవసర సేవలో నిలిచిపోయినట్లు తెలిసింది. పీజీ మరియు ఇంటర్నల్ ద్వారా జరిగే వైద్య సేవలు కూడా నిలిచిపోయినట్లు సమాచారం. ఇదే కొనసాగితే ఆసుపత్రిలో రోగులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే కలకత్తాలో డాక్టర్ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News August 15, 2024

జాతీయ జెండా ఎగరవేసిన హోం మంత్రి అనిత

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి తన క్యాంపు కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు పార్టీ నాయకుల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహానీయులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు.

News August 15, 2024

విశాఖ: ఇన్‌స్టాలో పరిచయం.. వివాహితకు బ్లాక్ మెయిల్‌

image

విశాఖ నగరానికి చెందిన ఓ వివాహితను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఒడిశాకు చెందిన శక్యాస్మిత్ రౌత్ అనే యువకుడిని సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా పరిచయమైన వివాహితను మాయమాటలతో శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ సమయంలో చేసిన వీడియోలను కుటుంబ సభ్యులకు పంపించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. దీనిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది.

News August 15, 2024

విశాఖ: గరీబ్ రథ్‌కు అదనపు కోచ్‌లు

image

వెయిటింగ్ లిస్ట్ జాబితాను తగ్గించేందుకు గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కే సందీప్ తెలిపారు. సికింద్రాబాద్ – విశాఖ గరీబ్ రథ్‌కు ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్‌కు ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు రెండు థర్డ్ ఏసి ఎకానమీ కోచ్‌లను జత చేస్తున్నామన్నారు.

News August 15, 2024

విశాఖలో పెరిగిన ఉల్లి ధర..!

image

ఉల్లి ధరలు మళ్ళీ పెరిగాయి. బుధవారం విశాఖ నగరంలో బహిరంగ మార్కెట్లో కిలో రూ.60కి విక్రయించారు. రైతు బజార్లలో 42 రూపాయల చొప్పున విక్రయాలు జరిపారు. దీంతో రైతుబజార్ల ఉల్లి కౌంటర్ల వద్ద క్యూలు కనిపించాయి. విశాఖ నగరానికి రోజు సుమారు 12 లారీల ఉల్లి అవసరం కాగా.. అందుకు తగ్గ స్థాయిలో రాకపోవడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారాలు తెలిపారు.

News August 14, 2024

విశాఖలో అభివృద్ధి చేయాల్సిన టూరిస్ట్ స్పాట్ ఏది?

image

రాష్ట్రంలో రూ.300 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని వేశారు. వీరు రుషికొండ భవనంపై అధ్యయనం చేయడంతో పాటు విశాఖ, SKLM, VZM జిల్లాలో కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించనున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగే విధంగా సూచనలిస్తారు. మరి మీ దగ్గర పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతం ఏదైనా ఉంటే కామెంట్ చెయ్యండి

News August 14, 2024

పాడేరు: త్వరలో ఓటర్ల నమోదుకు అవకాశం

image

విశాఖపట్నం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనుంది. దీంతో ఉపాధ్యాయ ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు సెప్టెంబర్ 30న నోటీసు జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఇందులో పాడేరు జేసీ అభిషేక్ పాల్గొన్నారు.

News August 14, 2024

విశాఖ జిల్లాలో రూ.5 భోజనం ఇప్పట్లో లేనట్లే

image

ఆగస్టు 15న పలు ప్రాంతాలలో అన్న క్యాంటీన్లు తెరచుకోనున్నాయి. కానీ విశాఖ జిల్లాలో మాత్రం పేదలకు రూ.5 కు భోజనం ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. దీనికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలే కారణం. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో విశాఖ జిల్లాలో అన్న క్యాంటీన్ల పున:ప్రారంభం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

News August 14, 2024

విశాఖ: శ్రీకాకుళం వరకే బ్రహ్మపుర రైలు

image

వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో పూండి-నౌపడా సెక్షన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా విశాఖ బ్రహ్మపుర రైలు గమ్యాన్ని కుదించినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. విశాఖ బ్రహ్మపుర రైలు ఈనెల 18వ తేదీన శ్రీకాకుళం రోడ్డు వరకే నడుస్తుందని పేర్కొన్నారు. ఈనెల 19న తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర విశాఖ రైలు బ్రహ్మపురకు బదులు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరుతుందన్నారు.