India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించి తీవ్ర అపచారం చేశారని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల రమేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ప్రాయశ్చిత్తంగా సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు, యాగాలు చేశారు.

ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు డి.ఏ నాయుడు తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన వారు అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 16న కౌన్సిలింగ్ జరిపి ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు.

విశాఖ నగరం కంచరపాలెం ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఊర్వశి జంక్షన్ నుంచి తాటిచెట్లపాలెం వైపు బైక్ మీద వెళుతున్న ముగ్గురు యువకులు కిందపడగా.. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వెళ్తూ అదుపుతప్పి కింద పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మధురవాడ పరిధిలో మారికవలసలో గల శ్రీ చైతన్య కళాశాల హాస్టల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదని విద్యార్థులు చేసిన ఆర్తనాదాలపై ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై తక్షణం నివేదిక అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం అన్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా రెవిన్యూ శాఖలో పలు క్యాడర్లలో బదిలీలు జరిగాయి. 40 మంది డిప్యూటీ తహశీల్దారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో అల్లూరి జిల్లాకు ఆరుగురు, అనకాపల్లి జిల్లాకు ఆరుగురిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లాలో 28 మంది డీటీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు 14 మంది జూనియర్ అసిస్టెంట్లు, 55 మంది సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశారు.

రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం రాత్రి విశాఖ రానున్నారు. రాత్రి 9.30 గంటలకు ఆయన నగరానికి చేరుకుంటారు. బుధవారం ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో నగరంలోని ఒక హోటల్లో నిర్వహించే సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. అనంతరం రుషికొండ ఐటీ పార్కును సందర్శించి అక్కడ ఉద్యోగులు, నిపుణులతో భేటీ అవుతారు. అదే రోజు రాత్రి తిరిగి బయలుదేరి విజయవాడ వెళతారు.

గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి అండర్-17 పుట్‌బాల్ పోటీలకు ఎస్.రాయవరం జడ్పీ పాఠశాలకు చెందిన 5 గురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాస్థాయిలో ఈ నెల 19న జరిగిన జిల్లా స్థాయి సెలెక్షన్స్‌లో ఎస్.రాయవరం విద్యార్థినులు కావ్య, భార్గవి, వాహిని, వైష్ణవి, వర్షిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.

ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజనలో మరింత మంది లబ్ధిదారులను చేర్చాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ సూచించారు. సోమవారం ఆయన ఈపీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరితగతిన అండర్ గ్రౌండ్ సిస్టం పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సింహాచలం సింహాద్రి అప్పన్నను సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయంలో సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీ.ఫార్మసీ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ, మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. కళాశాల వారీగా జంబ్లింగ్ చేసి నూతన పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు వెల్లడించారు. వివరాలకు ఏయూ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.