India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 20న జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం, అడివివరం, బి.ఆర్.టీ.ఎస్ రహదారి మీదుగా, ముడసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్.ఎ.డి కూడలి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు కాలి నడకన చేరుకుంటారు. > Share it
పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి కోట్లగరువు వద్ద రోడ్డుకి అడ్డంగా భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్డుకి అడ్డంగా ఈ వృక్షం కూలిపోయింది. దీంతో పాడేరు విశాఖ వైపు మైదాన ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాహనాల్లో ఒక 108 వాహనం ఉంది. స్థానికుల సహాయంతో చెట్టు తొలగిస్తున్నారు.
వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు ఆరా తీసారు. విశాఖ డిఆర్ఎం కార్యాలయంలో రైల్వే డివిజన్ అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు ప్రయాణికులకు అందుతున్న సేవలు సౌకర్యాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ పాల్గొన్నారు.
కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ఎ కుమారస్వామి బుధవారం విశాఖ వస్తున్నారు. సాయంత్రం 6.30గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ ఉక్కు అతిథి గృహానికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. 11న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గం టల వరకు ఉక్కు కర్మాగారం సందర్శించి సమీక్షా సమావేశాల్లో మంత్రి పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళతారు.
విశాఖలో డ్యూక్ బైక్‌తో మంగళవారం రాత్రి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. మాధవధార నుంచి వెళుతూ జ్యోతినగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని కంచరపాలెం నుంచి వస్తున్న క్రాంతి బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో త్రినాథరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. సన్యాసిరావు అనే వ్యక్తి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ రోజువారి కూలీలే. ఈ ఘటనలో బైకర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో 7,500 ఎకరాలలో గంజాయి తోటలను పోలీసుశాఖ ధ్వంసం చేసిందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. గంజాయి సాగుచేసే గిరిజనుల్లో మార్పు తీసుకువచ్చామన్నారు. గంజాయి సాగు చేసే రైతులపై కేసులు నమోదు చేయడంతో పాటు, వారిని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించి ఉచితంగా విత్తనాలు, పండ్ల జాతుల మొక్కలు అందజేశామన్నారు. వారికి ఉపాధి రంగాల్లోను శిక్షణ ఇచ్చామని తెలిపారు.
విశాఖ వైఎస్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో భాగంగా మంగళవారం కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి కోస్టల్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ 17.1 ఓవర్లలో 138 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ 141 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయిన ఖర్చుకు సంబంధించిన బిల్లులను వెంటనే సమర్పించాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను, నియోజకవర్గ ప్రధాన కేంద్రం తహశీల్దార్‌లను కలెక్టర్ ఏఎస్.దినేశ్ కుమార్ ఆదేశించారు. అదేవిధంగా గత 2022, 2023లలో జరిగిన వరదలకు సంబంధించి ముంపు మండలాల్లో డీసీ బిల్లులు డ్రా చేసిన తహశీల్దార్లు వెంటనే ఏసీ బిల్లులు పెట్టాలని, యుటిలైజేషన్ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపధ్యంలో నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కె.ఎస్ విశ్వనాథన్‌తో కలిసి కోస్టల్ బ్యాటరీ ఏరియా నుంచి ఆర్కే బీచ్ వరకు మంగళవారం పర్యటించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కమిషనర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల నాలుగో తేదీన విద్యార్థి సంఘాల బంద్ కారణంగా వాయిదా పడిన డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందని, యూజీ విద్యార్థులంతా హాజరుకావాలన్నారు.
Sorry, no posts matched your criteria.