India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుందని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులకు మిఠాయిలు పంచారు. ప్రజా ప్రయోజనార్థం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని విమర్శించారు.
విశాఖ నగరంలో డాక్ యార్డ్ వంతెనను జులై 10 నుంచి మూసివేస్తున్నట్లు వీపీఏ తెలిపింది. ఈ మేరకు వంతెనకు ఇరువైపులా ప్రయాణికులకు తెలిసేలా నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు వెళుతున్న మార్గం ద్వారానే నగరవాసులు రాకపోకలు సాగించాలని విజ్ఞప్తి చేసింది. 9-12 నెలల వరకు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు జరపనున్నట్లు పేర్కొంది.
ఏయూ హిందీ ప్రొఫెసర్ సత్యనారాయణపై అందిన ఫిర్యాదు మేరకు ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈనెల 19న స్వయంగా జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఏయూ ఉపకులపతికి కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆ రోజు ఉదయం వ్యక్తిగతంగా కాని, తన తరఫున మరో వ్యక్తిగాని 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. గత ఏడాది ఏయూ హిందీ విభాగం ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని ఓ మహిళా స్కాలర్ ఫిర్యాదు చేశారు.
ఎన్నికల తర్వాత CM హోదాలో చంద్రబాబు తొలిసారి విశాఖ రానున్నారు. ఈనెల 11న విశాఖలో ఆయన పర్యటించనున్నట్లు TDP శ్రేణులు తెలిపాయి. మెడ్‌టెక్, ఫార్మా, ఎస్ఈజెడ్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. కాగా.. 2019 ఆగస్టు 9న, అనంతరం అక్టోబర్ 12న సంభవించిన హుద్‌హుద్ తుపాన్ సమయంలో చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు పర్యటించారు. 2019 నుంచి 2024 వరకూ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు.
కన్నతల్లి, పెదనాన్న హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి విశాఖ మెంటల్ ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఏ.అశోక్ (26) తల్లిని హత్య చేయడంతో ఒంగోలు జైలుకు తరలించారు. బెయిల్‌కు సహకరించిన పెదనాన్నను హత్య కూడా చేశాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విశాఖ మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. బెయిల్ రాదని ఆందోళనతో కిటికీ ఊచలకు ఉరి వేసుకుని మృతి చెందాడు.
వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై కేజీహెచ్ వైద్యులు సిబ్బందిని అప్రమత్తం చేసామని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. వార్డులకు చికిత్స కోసం ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారో ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలకుండా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో డాక్టర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త రూపవతి తెలిపారు. ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, సోషల్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల్లో బోధించాలన్నారు. ఆసక్తి గల అర్హులైన వారు ఈ నెల 11న ఉదయం 10 గంటలకు మేహద్రి గెడ్డ అంబేడ్కర్ గురుకులంలో జరిగే డెమోకు హాజరు కావాలన్నారు.
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం <<13592420>>అర్ధరాత్రి హత్య<<>>కు గురైన సూర్యకిరణ్ శ్రీనగర్‌కు చెందిన మేఘనను రెండేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె ఈనెల 1న అగనంపూడి ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అత్త సుజాత ఆసుపత్రికి రాగా సూర్య కిరణ్ అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఆమెతో సన్నిహితంగా ఉన్న కొర్లయ్యకు చెప్పింది. దీంతో సిగ్నల్ దగ్గర మాటు వేసి సూర్యకిరణ్‌ను కొర్లయ్య హత్యచేశాడు.
నకిలీ ఫోన్లతో సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఫెడెక్స్ కొరియర్ పేరిట అనేక మందిని మోసం చేశారని, ఈ కొరియర్ పేరిట ఎవరు ఫోన్ చేసినా నమ్మవద్దని సూచించారు. ఫోన్ చేసి మీ ఆధార్‌పై ఫోన్ నెంబరు రిజిస్టర్ అయిందని, ఈ ఫోన్ ను ముంబయిలో ఒక వ్యక్తి దేశద్రోహానికి పాల్పడే వాటికి ఉపయోగిస్తున్నారని బెదిరింపులకు దిగి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
నర్సీపట్నం గబ్బడ ఇసుక డిపోలో అక్రమ నిల్వలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమగ్ర విచారణకు ఆదేశించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 65 వేల టన్నుల ఇసుకపై విచారణ చేపట్టాలన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని తెలిపారు. రూ.వందల కోట్లు దోచుకున్న ఇసుక మాఫియాను బయటపెట్టాలన్నారు. దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తొలగించినట్లవుతుందన్నారు. దీంతో అధికారులు విచారణ చేపట్టబోతున్నారు.
Sorry, no posts matched your criteria.