India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ తూర్పు నావికాదళంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ప్రారంభమైంది. సోమవారం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంథార్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని హబ్‌ను ప్రారంభించి రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్ర యానం, మారిటైం భద్రత వంటి అంశాలకు సంబంధించిన సాంకేతిక పరి జ్ఞానాన్ని సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఎ.ఐ. హబ్ ఉపయోగపడుతుందన్నారు.
అగనంపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సిగ్నల్ జంక్షన్ వద్ద ఓ యువకుడిని దారుణంగా హత మార్చారు. మల్కాపురానికి చెందిన క్యాబ్ డ్రైవర్ సూర్య (25)ను కత్తితో పొడిచి దుండగుడు హత మార్చాడు. మృతిని భార్య అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఇంతలో భర్త హత్యకు గురి కావడం ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ వైయస్సార్ స్టేడియంలో సోమవారం ఏపీఎల్ సీజన్-3లో వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్లు తలబడ్డాయి. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు 14 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన వైజాగ్ వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం వైజాగ్ వారియర్స్ ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి ఓటమి చెందింది.
ఈనెల 20వ తేదీన జరగనున్న సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వివిధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ కే.మయూర్ అశోక్, ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఆధార్ చేయించాలని, ఇదివరకే ఉన్న నమోదై పది ఏళ్లు దాటినవారికి మరోసారి అప్డేట్ చేయించి, బయోమెట్రిక్ చేయించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సోమవారం ఎంపీడీవోలను ఆదేశించారు. ఆధార్ లేక ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల ఫరిధిలో, ఏఎన్ఎంలు మినహా సచివాలయ సిబ్బందిని వినియోగించి మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
ముంబయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరావల్సిన 3 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఎయిర్పోర్టు డైరెక్టర్ రాజా రెడ్డి సోమవారం తెలిపారు. ఈ మేరకు విశాఖ నుంచి బెంగళూరు ఇండిగో, జైపూర్ ఇండియా వన్, ఎయిర్ ఇండియా ముంబయి విమాన సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై ప్రజలు 303 అర్జీలను అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు వాటిని పంపించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
వేపగుంట పేస్ట్రీ చెఫ్ రెస్టారెంట్ వద్ద బి.ఆర్.టి.ఎస్ ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంఒకరు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. పోలీసులు మృతుడిని ఎస్ కోట మండలం వెంకటరమణ పేట చెందిన కృష్ణ(37)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాంబిల్లి మండలం కొప్పుగుంటపాలెంలో బాలికను హత్య చేసిన హంతకుడి వివరాలు తెలిపితే రూ.50 వేలు బహుమతి అందజేస్తామని అనకాపల్లి పోలీస్ శాఖ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హంతకుడి కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రకటన విడుదల చేసింది. హంతకుడి పేరు బోడాబత్తుల సురేశ్‌గా పేర్కొంది. ఆచూకీ తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, 94407 96084 నంబర్‌కు తెలియజేయాలని కోరింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీ మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. గంభీరంలోని ఐఐఎం క్యాంపస్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఐఎం సంచాలకులు ఆచార్య ఎం.చంద్రశేఖర్ హాజరయ్యారు. విభిన్న రంగాల్లో అపార అనుభవం కలిగిన నిపుణులకు పీహెచ్డీలో ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం డీన్ కావేరి కృష్ణన్, రీసెర్చ్ డీన్ అమిత్ శంకర్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.