Visakhapatnam

News August 9, 2024

విశాఖ: ‘కాలేజీలకు రేపు సెలవు లేదు’

image

విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో శనివారం తరగతులు నిర్వహించుకోవచ్చని ఆర్ఐవో పి.మురళీధర్ వెల్లడించారు. గత నెలలో వర్షాలు కారణంగా కాలేజీలకు సెలవు ఇచ్చినందున, ఈ రెండో శనివారం తరగతులు నిర్వహించాలన్నారు. అకడమిక్ క్యాలెండర్ అమలు చేస్తూ, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

News August 9, 2024

విశాఖ: నేడు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థిని చంద్రబాబు సమక్షంలో శుక్రవారం ఖరారు చేయనున్నారు. ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో విశాఖ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం అభ్యర్థి పేరును ప్రకటించనున్నట్లు తెలిపారు.

News August 9, 2024

విశాఖ: బట్టల షాపులో అబార్షన్ కిట్లు..!

image

గోపాలపట్నం పరిధిలోని బాజీ జంక్షన్ వద్ద కేకే సిల్మ్స్ పేరిట బట్టల షాపు నడుపుతూ లైసెన్స్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హరికృష్ణ అనే వ్యక్తిని సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు పట్టుకున్నారు. షాప్‌‌లో సిల్డెనాఫీల్ సిట్రేట్, ఆల్ట్రాజోలం, అబార్షన్ కిట్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషద తనిఖీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

News August 9, 2024

పశుగణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి: అనకాపల్లి కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో 21వ పశుగణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్లకు ఈ నెల 6 నుంచి జరుగుతున్న శిక్షణ తరగతుల్లో ఆమె గురువారం పాల్గొన్నారు. పశు గణనకు సంబంధించిన గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ఏసిహెచ్ గణేశ్ మాట్లాడుతూ.. పశువుల ఖచ్చితమైన వివరాల సేకరణకు అధునాతనమైన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామన్నారు.

News August 8, 2024

నామినేటెడ్ పదవులతో సముచిత స్థానం: ఎమ్మెల్యే పల్లా

image

టీడీపీ నాయకులను నామినేటెడ్ పదవుల్లో నియమించి సముచిత స్థానం కల్పిస్తూ తగిన గుర్తింపు ఇవ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు.

News August 8, 2024

ఏయూలో రీవాల్యుయేషన్ ఫలితాల విడుదల

image

ఏయూ సైన్స్ కళాశాల పరిధిలో న్యూక్లియర్ ఫిజిక్స్, బయో కెమిస్ట్రీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్, బొటనీ, బయోటెక్నాలజీ, కోస్టల్ ఆక్వాకల్చర్, హ్యూమన్ జెనెటిక్స్, అప్లైడ్ జియాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ, మీటీరియాలజీ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల ఫలితాలను ఏయూ వెబ్ సైట్‌లో పొందుపరిచారు.

News August 8, 2024

ఏయూలో పీజీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల పరిధిలోని ఎం.కామ్ మూడవ సెమిస్టర్, ఎం.ఏ ఏన్షియంట్ హిస్టరీ ఆర్కియాలజీ మొదటి సెమిస్టర్ రీవాల్యుయేషన్, ఎంబీఏ (బి.ఎఫ్.ఎస్) నాలుగో సెమిస్టర్, ఎంబీఏ (ఆర్.ఎం) 4వ సెమిస్టర్, ఎంబీఏ (ఎఫ్.టి) నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఎంబీఏ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

News August 8, 2024

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ: గంటా

image

టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలే భవిష్యత్తు కూటమి గెలుపునకు నాందిగా పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన కార్పొరేటర్లు కూడా వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయలేదని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూడా వైసీపీకి ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు.

News August 8, 2024

యర్రాజీ జ్యోతికి సువర్ణావకాశం

image

విశాఖ అథ్లెట్ యర్రాజీ జ్యోతికి ఒలింపిక్స్‌లో సువర్ణావకాశం లభించింది. నిన్న జరిగిన 100 M. హర్డిల్స్ తొలి రౌండు హీట్స్-4లో 7వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. గురువారం జరగనున్న రెపెచేజ్ హీట్-1లో పోటీ పడే అవకాశం ఆమెకు దక్కింది. ఇంటర్నేషనల్ కెరీర్‌లో అత్యుత్తమ టైమింగ్ నెలకొల్పిన అథ్లెట్లకు సెమీస్‌కు చేరేందుకు టెక్నికల్ కమిటీ కల్పించే ఈ పోటీలో ఏడుగురితో తలపడి సెమీస్‌కు చేరే అవకాశం జ్యోతికి లభిచింది.

News August 8, 2024

రుషికొండ: ఈనెల 21కి విచారణ వాయిదా

image

పర్యావరణ అనుమతులు లేకుండా రుషికొండపై భవనాల నిర్మాణంపై బాధ్యుల మీద కేసు నమోదు చేసేలా మంగళగిరి పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టీ.గంగాధర్ పిటిషన్ దాఖలు చేశారు. గత జూన్ 23న అప్పటి సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి పలువురు మంత్రులపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడింది.