India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పర్యావరణ అనుమతులు లేకుండా రుషికొండపై భవనాల నిర్మాణంపై బాధ్యుల మీద కేసు నమోదు చేసేలా మంగళగిరి పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టీ.గంగాధర్ పిటిషన్ దాఖలు చేశారు. గత జూన్ 23న అప్పటి సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి పలువురు మంత్రులపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడింది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి బుధవారం కూడా నామపత్రాలు దాఖలు కాలేదు. ఈనెల 13 వరకు సమయం ఉంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ నాయకులు నామపత్రాలు తీసుకెళ్లారు. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణకు ఇప్పటికే ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. త్వరలో ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది. కాగా నేడు జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు కూటమి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
సంక్రాంతి తరువాత కూటమి నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారని ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం ఆనందపురం మండలం బోయపాలెంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.
రహదారులను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోని ముఖ్యమైన రహదారుల పరిస్థితిపై ఆయన సమీక్షించారు. నిధుల లభ్యత ప్రకారం రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. దీనిపై త్వరలో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ నడిచే రోజుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు రైల్వే బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రస్తుతం ఆదివారం మినహా ప్రతిరోజు వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తున్నట్లు తెలిపారు. త్వరలో మంగళవారం మినహా ప్రతిరోజు నడిచేలా మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ మార్పులు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయో త్వరలో ప్రకటించనున్నారు.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంతో వారిలో ఉత్సాహం రెట్టింపు కాగా.. వైసీపీ నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ గెలుపు ప్రభావం ఈనెల 30న జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికపై ఎంతవరకు ఉంటుందనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ స్ఫూర్తితో ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని కూటమి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ నాయకులు విజయం తమదేనని అంటున్నారు.
జిల్లాలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం కోసం బడికి వచ్చే విద్యార్థులు చాలామంది ఉన్నారని, ఇటువంటి పరిస్థితిల్లో పిల్లలు ఇష్టపడి తినేలా ఆహారం తయారు చేయాలని సూచించారు.
విశాఖ జిల్లాలో బాల కార్మికులను గుర్తించేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని మండల స్థాయి విద్యాశాఖ అధికారులకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఉన్నతాధికారుల నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోనుంది.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అధికారులు ప్రకటించారు. గల్లా పోలిపల్లి, గొలగాని వీరరావు, నూకరత్న, పిసిని వరాహ లక్ష్మి నరసింహం, పిల్లా మంగమ్మ, బల్లా శ్రీనివాసరావు, బొమ్మిడి రమణ, పులి లక్ష్మీ బాయి, విల్లూరి భాస్కర్ రావు, శరగడం రాజశేఖర్ ఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. విజేతలందరూ ఎన్డీఏ కూటమి బలపరిచిన వారే కావడం విశేషం.
Sorry, no posts matched your criteria.