Visakhapatnam

News July 3, 2024

ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా పోరాటం: సీపీఐ

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం విశాఖలో సీపీఐ నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. గత ప్రభుత్వం అక్రమాలపై విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

News July 3, 2024

విశాఖలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలోని కంచరపాలెం వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఘటనా స్థలంలోనే తండ్రి మరణించగా.. కొడుకు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 3, 2024

ఏయూ వీసీగా ఎవరు?

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ పదవికి పి.వి.జి.డి. ప్రసాద్ రెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో వీసీగా ఎవరు నియామకం అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవికోసం విశ్రాంత ఆచార్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సర్వీసులో ఉన్న ఆచార్యులు సైతం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 100 ఏళ్లకు దగ్గరవుతున్న ఏయూకు మహిళను వీసీగా నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

News July 3, 2024

జీతాల కోసం ఏయూ ఉద్యోగుల ఎదురుచూపులు..!

image

జీతాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మూడో తేదీ వచ్చినా ఉద్యోగులకు ఖాతాల్లో ఇంకా జీతాలు పడలేదు. ప్రతినెలా ఉద్యోగుల జీతాలకు దాదాపు రూ.36 కోట్లు వరకు ఖర్చవుతుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై స్వయంగా వీసీ సంతకం పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఏయూ వీసీ తన పదవికి రాజీనామా చేయగా, కొత్తవారిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నియమించలేదు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌‌తో పాలన సాగుతోంది.

News July 3, 2024

విశాఖలో ఉల్లి కోసం క్యూ

image

రైతు బజార్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు క్యూ కడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు టమాటాకు భారీగా డిమాండ్ ఏర్పడడం వల్ల 80 రూపాయల వరకు ధర పలికింది, దీంతో వినియోగదారులు క్యూ కట్టారు. తాజాగా ఉల్లిపాయల ధర కేజీ రూ.36కు చేరుకుంది. రైతు బజార్‌లో తగినంత సరుకు కూడా లేకపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వినియోగదారులు క్యూలో నిల్చొని ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు.

News July 3, 2024

భారత్-బంగ్లాదేశ్ స్నేహబంధం బలోపేతం

image

భారత్- బంగ్లాదేశ్ నౌకా దళాల మధ్య జరుగుతున్న విన్యాసాలతో రెండు దేశాల మధ్య స్నేహబంధం బలోపేతం కానుందని మంగళవారం విశాఖలో నేవీ అధికారులు తెలిపారు. భారత్ తరఫున హాజరైన ‘ఐఎన్ఎస్ రణవీర్’ యుద్ధనౌక కమాండింగ్ అధికారి(సీవో)కి బంగ్లాదేశ్ నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ ఖొండ్కర్ మిస్బా ఉల్ అజీమ్, రియర్ అడ్మిరల్ ఎస్. ఎం. మోనిరుజ్జామన్లు వేర్వేరు జ్ఞాపికలు అందించారు.

News July 3, 2024

విశాఖ పోర్ట్ మొదటి స్థానంలో నిలవడానికి కారణం ఇదే

image

భారత్ నుంచి 132 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. ఇందులో ప్రధాన దిగుమతిదారులుగా అమెరికా, చైనా నిలిచినట్లు పేర్కొన్నారు. ఎగుమతుల్లో రొయ్యలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. విశాఖ పోర్ట్ మొదటి స్థానంలో నిలవడానికి ఆక్వా కల్చర్ పరిశ్రమ ప్రధాన కారణమని అన్నారు. వనామీ రొయ్యలు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.

News July 3, 2024

విశాఖ: పలు రైళ్లకు అదనపు బోగీలు జత

image

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేసి నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ-సాయినగర్ శిర్డీ(18503) రైలుకు ఈనెల 4న, సాయినగర్ శిర్డీ-విశాఖ(18504) రైలుకు ఈనెల 5న అదనంగా ఒక జనరల్ బోగీ, అదేవిధంగా విశాఖ-చెన్నై సెంట్రల్(22869) రైలుకు ఈనెల 8న, చెన్నై సెంట్రల్-విశాఖ(22870) రైలుకు ఈనెల 9న అదనంగా ఒక జనరల్ బోగీని జత చేస్తారని పేర్కొన్నారు.

News July 3, 2024

విశాఖ: సీబీసీఎస్సీ స్థలంలో తవ్వకాలపై గనుల శాఖ ఆరా

image

సిరిపురం కూడలి సమీపంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ పీక్ ప్రాజెక్టులో జరిపిన తవ్వకాలపై గనుల శాఖ ఆరా తీసింది. అనుమతులు పొందిన ప్రాంతంలో ప్రత్యేక పరికరాలతో సర్వే నిర్వహించి అనుమతులు పొందిన దాని కంటే ఎక్కువగా తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సంబంధిత ప్రాజెక్టు ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. కాగా కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు.

News July 3, 2024

మాతృ భాషా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి: ఐటీడీఏ పీవో

image

అల్లూరి మన్యంలోని మారుమూల గిరిజన గ్రామాల పాఠశాలల్లో బోధించే ఆదివాసీ మాతృ భాషా వాలంటీర్లు నేటి(బుధవారం)నుంచి విధుల్లో చేరాలని ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ సూచించారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. మాతృ భాషా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఎంఈవోలకు పీవో మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.