India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మంగళవారం అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతంలో నెలకొన్న సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నంబర్-3ని అమలు చేయాలని కోరారు. గిరిజన కాఫీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, గిరిజన కాఫీ సొసైటీ స్థాపించాలని రాష్ట్రపతిని కోరినట్లు ఎంపీ తెలిపారు.
అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా విజయకృష్ణన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమె ఇటీవల అల్లూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన దినేశ్ కుమార్ భార్య కావడం విశేషం. అల్లూరి జిల్లాలో దినేశ్ కుమార్, అనకాపల్లి జిల్లాలో ఆయన భార్య విజయకృష్ణన్ సేవలు అందించనున్నారు. గతంలో వీరిరువురూ ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కలెక్టర్లుగా పనిచేశారు.
APLలో వైజాగ్ వారియర్స్ ఘన విజయం సాధించింది. విశాఖ వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో రాయలసీమ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి బ్యాటింగ్ చేసిన రాయలసీమ కింగ్స్ 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వైజాగ్ వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
విశాఖ కలెక్టర్‌గా హరీంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌గా ఉన్న డా.ఎ.మల్లికార్జున వారం క్రితం బదిలీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తాత్కాలికంగా కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా కె.విజయ నియమితులయ్యారు.
పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ఈనెల 6, 14, 16 తేదీల్లో విశాఖ-పూరీ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రి పూరీ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో పూరీ-విశాఖ స్పెషల్ ఈనెల 8, 16, 18 తేదీల్లో అర్ధరాత్రి 1.45 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం పదిన్నర గంటలకు విశాఖ చేరుకుంటుందని తెలిపారు.
విశాఖ శారదా పీఠానికి కేటాయించిన కొత్తవలసలోని 15 ఎకరాలకు పైగా కొండను సాధు పరిషత్ స్వామీజీలు, హిందూ సంస్థల ప్రతినిధులు పరిశీలించారు. కాగా ఆ భూకేటాయింపులను తమ వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతివ్వాలని గతంలో శారదాపీఠం ప్రభుత్వాన్ని కోరింది. దీంతో కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సాధు పరిషత్ స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థలు.. శ్రీనివాసానంద సరస్వతి నేతృత్వంలో ఈ రోజు సందర్శించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బి-ఫార్మసీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలతోపాటు ఫార్మా-డి 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఫలితాలను వెబ్ సైట్ నుంచి నేరుగా పొందవచ్చని సూచించారు.
విశాఖపట్నం నుంచి ఆరుగురు ట్రైనీ కలెక్టర్లు ఫీల్డ్ విజిటింగ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టర్ వారి కార్యాలయానికి విచ్చేశారు. ఆరుగురు ట్రైనీ కలెక్టర్లకు కొద్దిరోజుల్లో పోస్టింగ్స్ కేటాయిస్తున్న సందర్భంగా ఫీల్డ్ విజిట్ చేస్తున్నట్లు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. ట్రైనీ కలెక్టర్లలో ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు.
హోం మంత్రి వంగలపూడి అనితను ప్రభుత్వం అతిథి గృహంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రాత బాగ్చి మర్యాదపూర్వకంగా మంగళవారం భేటీ అయ్యారు. కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హోం మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఆమెతో చర్చించారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని గతంలో మంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
AU పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈనెల 4,6తేదీలలో డా.వీఎస్ కృష్ణ కళాశాలలో స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈనెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని.. 11 తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 19న సీట్ల కేటాయించి.. 22 లోపు క్లాసులు ప్రారంభిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. AU పరిధిలో మొత్తం 163 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.