Visakhapatnam

News August 1, 2024

విశాఖ: తనికెళ్ల భరణికి జీవన సాఫల్య పురస్కారం

image

రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారం లభించింది. గురువారం విశాఖ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయనకు పురస్కారాన్ని అందజేయడంతో పాటు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు బాదంగీర్, దర్శకుడు భాష, యువ నటుడు సతీశ్ కుమార్, బుద్దాల వెంకట రామారావు, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

News August 1, 2024

లోక్ సభ ప్రజాపద్దుల కమిటీలో అనకాపల్లి ఎంపీకి చోటు

image

లోక్ సభ ప్రజాపద్దుల(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) కమిటీలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు చోటు లభించింది. 15 మంది సభ్యులతో 18వ లోక్ సభలో ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు అయింది. కమిటీ ఛైర్మన్‌గా రాహుల్ గాంధీ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి చోటు లభించింది. సీఎం రమేశ్ గతంలో కూడా రాజ్యసభ నుంచి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పని చేశారు.

News August 1, 2024

‘లక్ష్మీపార్వతికి గౌరవ ఆచార్యుల హోదా ఉపసంహరణ’

image

గతంలో తెలుగు అకాడమి ఛైర్పర్సన్‌గా బాధ్యతలను నిర్వహించిన ఎన్.లక్ష్మీపార్వతికి గౌరవ ఆచార్యుల హోదాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.కిషోర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమెకు ఇప్పటి వరకు ఎటువంటి వేతనం వర్సిటీ నుంచి చెల్లించలేదని స్పష్టం చేశారు. ఆమె వద్ద మార్గదర్శకం కోసం చేరిన పరిశోధకులను తెలుగు విభాగంలో మరొక ఆచార్యునికి మార్పు చేయాలని ఆదేశించారు.

News August 1, 2024

విశాఖ: కామాంధుడైన తండ్రికి జీవిత ఖైదు

image

కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రి కేసులో విశాఖ స్పెషల్ ;Yక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధించింది. 2020 సంవత్సరంలో కోల్‌కతా నుంచి విశాఖ వచ్చిన నిందితుడు భార్య క్యాన్సర్‌తో చనిపోయిన తరువాత కన్న కూతురుపై కన్నేసాడు. రాత్రి సమయంలో కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడేవాడు. బాధితురాలు గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ కేసుపై కోర్టు తీర్పునిచ్చింది.

News August 1, 2024

ఏయూ: జబ్లింగ్ విధానంలో ఎంసీఏ పరీక్షల

image

ఏయు పరిధిలో ఎంసీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 12 నుంచి జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు ఏ.సీ.ఈ జె.రత్నం తెలిపారు. నోబెల్ ఇన్స్టిట్యూట్, ఏక్యూజే కాలేజ్, డాక్టర్ ఎల్.బి కాలేజ్, సాంకేతిక విద్యా పరిషత్, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ కళాశాల విద్యార్థులు ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో, బొబ్బిలి ఆర్ఎస్ ఆర్కే ఆర్ఆర్ కాలేజ్ విద్యార్థులు, బొబ్బిలి శ్రీగాయత్రి డిగ్రీ కాలేజీలో పరీక్షలకు హాజరవుతారు.

News August 1, 2024

ఏయూ పరిధిలో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంకామ్ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను, బిబిఏ-ఎంబీఏ ఆరో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. ఎం.కామ్ విద్యార్థులు ఆగస్టు 14లోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి. బిబిఏ-ఎంబీఏ విద్యార్థులు ఆగస్టు 15లోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల విభాగం అధికారులు సూచించారు.

News August 1, 2024

విశాఖ: హార్ట్ బ్రేకింగ్ PHOTO

image

పద్మనాభం మండలం పొట్నూరు గ్రామంలో విషాదం నెలకొంది. సొంతపొలంలో ఆకు తీస్తుండగా సబంగి బద్రి (40) అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. పక్కన ఎవరూ లేకపోవడంతో మరణించాడు. అప్పటి వరకు తల్లిదండ్రులు ఉండగా.. ఫిట్స్ రావడానికి కొద్దిసేపటి క్రితమే వారు భోజనానికి వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మరణించిన వ్యక్తికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 1, 2024

ఏయూ: ఈనెల 21 నుంచి ఎంబీఏ పరీక్షలు ప్రారంభం

image

ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూ సిబ్) లో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె తెలిపారు.

News August 1, 2024

సూరత్-బ్రహ్మపూర్ స్పెషల్ ట్రైన్ పొడిగింపు

image

సూరత్-బ్రహ్మపూర్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ ను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిసిఎం కే.సందీప్ తెలిపారు. సూరత్ బ్రహ్మపూర్ స్పెషల్ సూరత్‌లో ప్రతి బుధవారం మధ్యాహ్నం బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు దువ్వాడ చేరుకుని అక్కడనుంచి బ్రహ్మపూర్ వెళుతుందన్నారు. దీనిని ఈనెల 27 వరకు పొడిగించామన్నారు. బ్రహ్మపూర్ సూరత్ స్పెషల్ బ్రహ్మపూర్‌ లో ప్రతి శుక్రవారం బయలుదేరుతుందని అన్నారు.

News August 1, 2024

విశాఖలో ముందుకొస్తున్న సముద్రం

image

వాతావరణ మార్పుల నేపథ్యంలో విశాఖలో సముద్రం ముందుకు వస్తోందని బెంగళూరుకు చెందిన స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ సంస్థ అధ్యయనంలో తెలిపింది. విశాఖలో 1987- 2021 మధ్యకాలంలో 2,381 సెంటీమీటర్ల భూభాగం సముద్రంలో కలిసిపోయిందని తెలిపింది. 2040 నాటికి విశాఖనగరంలో ఐదు శాతం భూభాగం సముద్రంలో కలిసిపోతుందని తమ అధ్యయనంలో పేర్కొంది.