India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మినహా మిగిలిన చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ 9, జనసేన 3, బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దక్షిణ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ అధినేత పవన్ అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తున్నారు. నేడో, రేపో దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
వాల్తేరు రైల్వే డివిజన్ మరో రికార్డు సాధించింది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో సరుకు రవాణా చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 26వ తేదీ నాటికి 75.64 మిలియన్ టన్నుల మార్కును దాటినట్లు వాల్తేరు రైల్వే డీఆర్ఎం సౌరభ ప్రసాద్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 69.9 మిలియన్ టన్నుల సరుకులు రవాణా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఐదు రోజుల వ్యవధి ఉండగా 75.64 మిలియన్ టన్నుల రవాణా చేసినట్లు తెలిపారు.
విశాఖ మధురవాడలో శుక్రవారం యువతి(17) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొమ్మాదిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్లోని 4వ అంతస్తు నుంచి దూకేసింది. కాలేజీ ఫ్యాకల్టీ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆత్మహత్యకు ముందు విద్యార్థిని కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసినట్లు సమాచారం. మృతురాలి తండ్రి నాతవరం మండలానికి చెందిన వ్యవసాయం కూలీ. యువతి ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
విశాఖకు చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఎంబీఏ)లో రూ.కోటి ఉపకార వేతనంతో సీటు లభించింది. అమెరికాలోని ఐవీవై లీగ్ యూనివర్సిటీలోనూ సీటు లభించిందని, అయినా స్టాన్ఫోర్డు వర్సిటీలో చేరనున్నట్లు వరుణ్ తెలిపారు. దేశంలో అతికొద్ది మందికి మాత్రమే ఉపకారవేతనంతో కూడిన సీటు లభిస్తుందన్నారు.
ఓటింగ్ శాతం తగ్గరాదనే ముందు చూపుతో ఎన్నికల సంఘం 85 ఏళ్లు దాటిన వారికి, 40% పైగా వైకల్యమున్న దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. అర్హులైన వారికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందించి, వారితో ఓటు వేయించే బాధ్యత రిటర్నింగ్ అధికారి ఆదేశాలతో బీఎల్వోలే తీసుకుంటారని తెలిపింది. నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లో వాటిని భర్తీ చేసి బీఎల్వోలకు సమర్పించాలని నోడల్ అధికారి హేమంత్ తెలిపారు.
విశాఖలో తొలిసారిగా ఒక దివ్యాంగుడు బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశా దివ్యాంగ్ సురక్ష ద్వారా ఈ నెల 15న డయల్ యువర్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కోటవురట్లకు చెందిన ఒక దివ్యాంగుడు ఫోన్ చేసి.. అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఒక సంస్థ తమ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిందని బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భీమిలిలో గురుశిష్యుల మధ్య పోటీతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. 2009లో అవంతిని గంటా రాజకీయాల్లోకి పరిచయం చేశారు. 2009లో వీరిద్దరూ ప్రజారాజ్యం నుంచి పోటీచేయగా అనకాపల్లిలో గంటా, భీమిలిలో అవంతి గెలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇద్దరూ వేరు వేరు పార్టీలలో చేరి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరూ భీమిలిలో ప్రత్యర్థులుగా దిగుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.
భీమిలి టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఖరారైన గంటా శ్రీనివాసరావుకు ఓటమి ఎరుగని నేతగా పేరుంది. 1999 ఆయన అనకాపల్లి నుంచి మొదటిసారిగా టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2004లో చోడవరం నుంచి, 2009లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో మంత్రి అయ్యారు. 2014లో మళ్లీ టీడీపీలో చేరిన ఆయన భీమిలి నుంచి, 2019లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉత్కంఠ రేపిన గంటా శ్రీనివాసరావు పోటీచేసే స్థానాన్ని ఎట్టకేలకు టీడీపీ ఖరారు చేసింది. భీమిలి నుంచి బరిలో ఉంటారని తుదిజాబితాలో వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా.. ఈసారి కూడా ఆయన పోటీచేసే స్థానం మారడం గమనార్హం. చీపురుపల్లి నుంచి ఆయన పోటీచేస్తారని ఊహాగానాలు వచ్చినా అక్కడి నుంచి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. కాగా భీమిలి వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పోటీచేస్తున్నారు.
విశాఖపట్నం సాగర్ నగర్ సముద్ర తీరంలో మత్స్యకారులకు సముద్ర కప్పలుగా పిలవబడే విభిన్న చేపలు లభించాయి. తిరిగారు ఈ తరహా జీవులను పవర్ ఫిష్ గా పిలుస్తారని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. సముద్రపు అట్టడుగు లోతుల్లో సంచరించే ఈ జీవులు దాడికి గురైన సమయంలో ఇలా బెలూన్ రూపంలో ఆకృతిని మార్చుకుంటాయని పేర్కొన్నారు. ఈ చేపలను చూడడానికి పలువురు ఆసక్తి చూపారు.
Sorry, no posts matched your criteria.