India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కంచరపాలెంలో ఐటీఐ ప్రవేశాలకు సంబంధించిన మూడో విడత కౌన్సెలింగ్ గురువారం జరగనున్నట్లు ప్రభుత్వ పాత ఐటీఐ ప్రిన్సిపల్ జె.శ్రీకాంత్ తెలిపారు. గత రెండు విడతల్లో జరిగిన కౌన్సెలింగ్లో అన్ని సీట్లు భర్తీ చేయగా ఇంకా ఇరవై ఎనిమిది సీట్లు మిగిలాయని, వాటిని భర్తీ చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసి, పత్రాలను ధ్రువీకరణ చేయించుకున్న అభ్యర్థులు అన్ని ఒరిజినల్ పత్రాలతో హాజరవ్వాలని ఆయన తెలిపారు.

సింగపూర్, మలేషియాలో సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు అంతర్జాతీయ క్రీడా పోటీలు జరగనున్నాయి. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె సాహితీ ఈ పోటీలకు ఎంపికయ్యారు. నాగజ్యోతి పవర్ లిఫ్టింగ్, సాహితీ స్విమింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. వీరిద్దరూ విజయాలను అందుకొని రాష్ట్రానికి తిరిగి రావాలని పలువురు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా సింహాచలంలో 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. మహిళలందరూ కలిసి పూజ చేసుకోవడానికి దేవస్థానం అవకాశం కల్పిస్తోందన్నారు. పూజకు అవసరమైన సామగ్రి, పసుపు, కుంకుమ, విడి పువ్వులు, పత్రి ఉచితంగా అందజేస్తామని చెప్పారు. పూజకు వచ్చే మహిళలకు కొండ దిగువ నుంచి పైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.

విశాఖ వేదికగా సర్యులర్ ఎకానమీ- పాలసీ టు ఇంప్లిమెంటేషన్ పేరుతో జాతీయ స్థాయి వర్క్ షాప్ గురువారం జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం పర్యవేక్షించారు. సిటీలోని నోవాటెల్ హోటల్‌లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సదస్సులో సుమారు 150 మంది ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

గుజరాత్‌లోని వడోదరలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. బుధవారం బయలుదేరే గాంధీగ్రామ్-పూరీ ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్, 31న బయలుదేరే పూరీ-గాంధీగ్రామ్ వీక్లీ స్పెషల్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. నేడు బయలుదేరే తాంబరం-సంత్రాగచ్చి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్, నేడు బయలుదేరే సంత్రాగచ్చి-సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ ప్రెస్‌ను రద్దు చేసినట్లు తెలిపారు.

తీరప్రాంతాలకు ముంపు సమస్య ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని 15 నగరాల్లో అధ్యయనం చేయగా అందులో విశాఖ కూడా ఉంది. 1987 నుంచి 2021 వరకు విశాఖలో 2.381 సెం.మీ సముద్ర మట్టం పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. 2040 నాటికి విశాఖలో 5% భూమి మునిగిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. జనాభా పెరుగుదల, వాతావరణంలో మార్పులు, పట్టణీకరణ తదితర అంశాల ఇందుకు ప్రధాన కారణంగా అధ్యయనంలో తేలింది.

చెన్నై-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్(12840) రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. చెన్నైలో ఈరోజు రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్ 4 గంటలు ఆలస్యంగా రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని వెల్లడించారు. ఈ ట్రైన్ విశాఖకు రేపు మధ్యాహ్నం 12:10 గంటలకు చేరుతుంది. ప్రయాణీకులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

గంజాయి రవాణా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో ఐదు జిల్లాల ఎస్పీలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గంజాయి రవాణా- నియంత్రణపై సమీక్షించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిని విచారించి ఇందులో ఎవరెవరు ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములుగా ఉన్నారో గుర్తించాలన్నారు.

గిరిజన ప్రాంతంలో అల్లం ధర ఒక్కసారిగా పడిపోయింది. గతవారం మార్కెట్లో కిలో రూ.60-రూ.70 వరకు ధర పలికింది. ఈ వారం లోతుగెడ్డ వారపు సంతలో వర్తకులు కిలో రూ.40కి కొనుగోలు చేశారు. ప్రతి ఏడాది రైతులు ఆగస్టులో పాత అల్లం పొలాల నుంచి తీసుకుని మార్కెట్‌లో విక్రయిస్తారు. ఒక్కసారిగా కిలో రూ.40కి ధర పడిపోవడంతో గిట్టుబాటు కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈనెల 29న విశాఖపట్నం రానున్నారు. ఉదయం 10 గంటలకు దిల్లీలోని పాలెం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌కు చెందిన నేవల్ బేస్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 01.45 గంటల వరకు అక్కడ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.