Visakhapatnam

News July 25, 2024

ఉత్తరాంధ్ర సామెత చెప్పిన హోం మంత్రి అనిత

image

అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ‘వైసీపీ సానుభూతిపరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా’ అని హోం మంత్రికి ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న వేశారు. సభకు వైసీపీ MLAలు హాజరుకాకపోయినా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు మంత్రి అనిత. ‘మొగుడిని కొట్టి.. మొగసాలు ఎక్కిందట’ అని ఉత్తరాంధ్రలో వాడే సామెత చెప్పారు. అధికారం కోల్పోయిన వైసీపీ.. టీడీపీ నాయకులపై దాడులు చేసి ఇప్పుడు ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.

News July 25, 2024

విశాఖ: స్పీకర్‌ పై 17, హోంమంత్రిపై 6 కేసులు

image

గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో TDP నేతలపై వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుత ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రునిపై అత్యధికంగా 17 కేసులు నమోదయ్యాయి. హోంమంత్రి అనితపై 06 కేసులు, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడిపై 04, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ పై 03 కేసులు పెట్టారని చెప్పారు.

News July 25, 2024

ఏయూ: ఎంఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 27న జరగాల్సిన ఎంఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్షను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష ఉన్న కారణంగా ఈ పరీక్షను వాయిదా వేశామన్నారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఆ తేదీల్లో ఎలాంటి మార్పు చేయలేదన్నారు.

News July 25, 2024

అరకు: విధుల్లో గుండెపోటు.. కండక్టర్ మృతి

image

పాడేరు డిపోకు చెందిన కండక్టర్ పీ‌ఎస్‌ఎస్ నారాయణ గుండెపోటుతో మృతి చెందారు. గురువారం పాడేరు నుంచి అరకులోయకు వెళ్తున్న బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ నారాయణకు గుండెపోటు వచ్చింది. అదే బస్సులో అరకులోయ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. డిపో మేనేజర్ శ్రీనివాస్ అరకులోయ ఆసుపత్రికి చేరుకున్నారు. తోటి ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.

News July 25, 2024

విసన్నపేట లేఅవుట్‌పై వీఎంఆర్డీఏ నోటీసులు

image

కశింకోట మండలం <<13690589>>విసన్నపేట<<>>లో వైశాఖీ వ్యాలీ పేరు మీద వేసిన లేఅవుట్‌లో ప్లాట్ల విక్రయాలు నిలిపివేయాలని వీఎంఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో తగిన సమాధానం ఇవ్వాలని లేఅవుట్ సంస్థ వింటేజ్ మౌంట్ వ్యాలీ రిసార్ట్స్‌ను ఆదేశించింది. ఈ లేఅవుట్‌‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్రమాలకు పాల్పడ్డారని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వీఎంఆర్డీఏ కమిషనర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు.

News July 25, 2024

ఈనెల 28న నరవ ఐటిఐలో కౌన్సిలింగ్

image

నరవ ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ జరగనున్నట్లు ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీకి అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తుల చేసుకున్న గడువు బుధవారంతో ముగిసిందన్నారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టరు, ఎలక్ట్రానిక్, మెకానిక్, డీజిల్ మెకానిక్ ట్రేడులలో సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థులంతా కౌన్సెలింగ్ రోజున అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.

News July 25, 2024

ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు

image

ఎల్టీటీ-విశాఖ(18520) ఎక్స్ ప్రెస్ ఈ నెల 29 నుంచి ఆగస్టు 1 వరకు వయా పుణె-మిరాజ్-కుర్దువాడి స్టేషన్ల మీదుగా నడుస్తుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈ నెల 30న భువనేశ్వర్-పుణె (22882) ఎక్స్ ప్రెస్ సోలాపూర్ వరకు నడుస్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 1న పుణె- భువనేశ్వర్(22881) ఎక్స్ ప్రెస్ పుణె బదులు సోలాపూర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నారు.

News July 25, 2024

విశాఖ: అందమైన అమ్మాయిల ఫొటోలు ఎరగా వేసి

image

అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి వివాహం చేసుకుంటారా అని నమ్మించి మోసం చేస్తున్న బి.సాయిప్రియ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు చెందిన ఓ అవివాహితుడుకి మ్యాట్రిమోనీలో రిక్వెస్ట్ పెట్టి రూ.22 లక్షలు తన ఖాతాలో వేయించుకుంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లో ఆ మహిళను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

News July 25, 2024

నేడు వాటర్ మెన్ ఆఫ్ ఇండియా విశాఖలో పర్యటన

image

వాటర్ మెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ నేడు ఎర్ర మట్టి దిబ్బలు, మడసర్లోవ, చిల్లపేట చెరువు, లాసన్స్ బే వద్ద సముద్రంలో కలుస్తున్న మురుగునీటి పరిశీలనకు వస్తున్నారు. ఉదయం 10 గంటలకు ముడసర్లోవ డంప్ యార్డ్, 11 గంటలకు చిల్లపేట చెరువు (భీమిలి), మధ్యాహ్నం 12.30 గంటలకు ఎర్ర మట్టి దిబ్బలు, మధ్యాహ్నం 2 గంటలకు లాసన్స్ బే బీచ్ పాయింట్ పరిశీలిస్తారు.

News July 25, 2024

అనకాపల్లి: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

అనకాపల్లిలో ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం తనిఖీ చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ఇతర పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భద్రతా పరమైన చర్యలపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం లాక్ బుక్కులో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వై. శ్రీనివాసరావు పాల్గొన్నారు.