India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఆర్జిత సెలవులు (ఈఎల్) ఎన్‌క్యాష్‌మెంట్‌ను తాత్కాలికంగా నిలిపేస్తూ యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 నుంచి అధికారులకు 270, కార్మికులకు 170 దాటి ఆర్జిత సెలవులు ఉంటే, అందులో ఏడాదికి గరిష్టంగా 30 ఆర్జిత సెలవులను ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని నిలిపివేశారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

కలుషిత ఆహారం తిని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆరుగురు విద్యార్థులు శనివారం డిశ్చార్జ్ అయ్యారు. పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి రమణమూర్తి ఆధ్వర్యంలో ఆయా చిన్నారులకు అన్ని రకాల మందులు అందజేశారు. కాగా మరో నలుగురు విద్యార్థులు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు. మరో వారం రోజుల్లో వారిని కూడా డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.

విశాఖ పోర్టు స్టేడియంలో ఈ నెల 26 నుంచి జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి భద్రత ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ శనివారం సాయంత్రం పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తొక్కిసలాటకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5 వరకు జరిగే కార్యక్రమంలో లోటుపాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

విశాఖలోని మెడ్ టెక్ జోన్ దేశీయంగా తొలిసారి మంకీ పాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ తయారుచేసి మరో ఘనత సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన పలు దేశీయ ఉత్పత్తులను ఈ సంస్థ అందించింది. ఈ కిట్ ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతి లభించినట్లు మెడ్ టెక్ జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ తెలిపారు.

విశాఖ జిల్లాలో గల అన్ని పరిశ్రమలలో వారం రోజుల్లోగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్ లో పరిశ్రమల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్మికుల, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమలను నిర్వహించాలన్నారు. నిర్వాహకులు లోటుపాట్లను గుర్తించి సరి చేయాలన్నారు. వచ్చే నెల 30వ తేదీలోగా అన్ని చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

దువ్వాడ రైల్వే స్టేషన్ లో వందే భారత్ కు హాల్ట్ సౌకర్యం కల్పించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ విజ్ఞప్తి చేశారు. విశాఖ డిఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వాల్తేరు డివిజన్ పరిధిలో రైల్వే ప్రాజెక్టులు, లైన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల ప్రతిపాదనలపై చర్చించారు. విశాఖ-బెంగళూరు మధ్య వారానికి మూడుసార్లు రైళ్లు నడపాలన్నారు. ఈ సమావేశానికి డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ అధ్యక్షత వహించారు.

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జల్లపల్లి సుభద్ర ఉమ్మడి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్థాయి సంఘం సమావేశంలో శనివారం ఆమె మాట్లాడారు. అచ్యుతాపురం ఎషెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులకు వైద్యులు అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరవాడ ఫార్మాసిటీలో ఈ నెల 23న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఝార్ఖండ్‌కు చెందిన రొయ్య అంగీరా(22) మృతి చెందాడు. సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు ఏ విధమైన న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం హౌరాలో బయలుదేరే రైలు (22877) హౌరా-ఎర్నాకులం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ 4:10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనుంది. మధ్యాహ్నం 14:50 గంటలకు బదులుగా 19:00 గంటలకు హౌరాలోని బయలుదేరుతుంది. భువనేశ్వర్, విజయనగరం మీదుగా దువ్వాడ స్టేషన్‌కు రేపు ఉదయం 9:05 చేరనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

SMV బెంగళూరు నుంచి రేణిగుంట, విజయవాడ మీదుగా నడుస్తున్న SMV బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్ (12864) శనివారం 10:35 గంటలకు బయలుదేరడానికి బదులుగా 14:00 గంటలకు బయలుదేరనుంది. విశాఖకు రేపు ఉదయం 8:00 గంటలకు చేరుకోవచ్చు కావున ప్రయాణికులు ఈ మార్పును గమనించగలరని రైల్వే అధికారులు కోరారు.
Sorry, no posts matched your criteria.