India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనకాపల్లి జిల్లాలోని 9 చెక్ పోస్టుల వద్ద పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ రవి పట్టం శెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణం నుంచి గ్రామాల వరకు ఎక్కడ ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. నియమావళి అమలు, పరిశీలన పట్ల అధికారులు నిశితంగా గమనించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి గురువారం అర్ధరాత్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ఆర్.ఎస్.నాయుడు బాబు విశాఖ పోర్ట్ అథారిటీలో దినసరి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. జీతం సరిపోక కుటుంబ పోషణ కష్టమవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. చేసిన అప్పులు తీర్చమని ఒత్తిళ్లు పెరగడంతో గురువారం అర్ధరాత్రి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
టీడీపీ మూడో జాబితాలో 13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా భరత్ మరోసారి బరిలో దిగుతున్నారు. అటు వైసీపీ బొత్స ఝాన్సీ పోటీచేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భరత్ ప్రచారం చేస్తుండగా, అధికారిక ప్రకటనతో మరింత ఊపందుకోనుంది. ఈ సారి విశాఖలో ఎవరు నెగ్గుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపుకు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూజీ నగర్‌లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బోర సుధాకర్ రెడ్డి (40) తన అన్న సురేశ్ రెడ్డితో కలిసి నివసిస్తున్నాడు. తనకి వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై అందరితోనూ గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం తను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున స్పష్టం చేశారు. గురువారం పోల్ మేనేజ్మెంట్, సిబ్బంది కేటాయింపు ఇతర అంశాలపై చర్చించే నిమిత్తం జిల్లాలోని అన్ని శాఖల అధిపతులతో కలెక్టరేట్ వీసీ హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల పరిధిలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అత్యంత ఖచ్చితంగా జిల్లా యంత్రాంగానికి నివేదించాలన్నారు.
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు పంచాయితీలోని కోడాపల్లిలో ఘోరం జరిగింది. గ్రామానికి చెరుకు చంద్రరావు, జానకి దంపతుల ఏడాదిన్నర కుమారుడు గణేష్ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి మృతి చెందాడు. తొట్టిలో పడిన బాలుడిని దేవరాపల్లి పీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బాలికను ప్రేమ పేరిట వేధిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. దువ్వాడ సెక్టర్-1లో ఉంటున్న డి. మణికంఠ(33) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. తొమ్మిదో తరగతి బాలిక పాఠశాలకు రాకపోకలు సాగించే సమయంలో, మణికంఠ ఆమె వెంట పడి, ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. విసిగిపోయిన బాలిక వేధింపుల విషయాన్ని ఇంట్లో చెప్పడంతో, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బుధవారం లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా నటి అనసూయ సందడి చేసారు. MP డా.సత్యవతి, వ్యవసాయ కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు, TDP పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత, TDP నాయకులు యనమల కృష్ణుడు, గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్, కాంగ్రెస్ నాయకులు జగతా శ్రీనివాస్ పలు బ్లాకులు ప్రారంభించారు. పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అనసూయ అన్నారు.
గిరిజనులు పండించే పసుపు ధర రోజురోజుకూ పెరుగుతోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో కిలో పసుపు రూ.45 నుంచి రూ.55 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది పసుపు ప్రారంభం నుంచి రూ.80 నుంచి 140 వరకు మార్కెట్‌లో వ్యాపారులు పోటీపడి మరీ కోనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది గిరిజన సహకార సంస్థ వారపు సంతలోని కనీసం పసుపు, మిరియాల ధరలు కూడా ప్రకటన చేయలేదని, అది చేసి ఉంటే మరింత ధర పలుకుతుందని గిరిజన రైతులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.