India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింహాద్రి అప్పన్న సోదరి తల్లి అమ్మ జాతర మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సింహాచలం అడవివరం తోపాటు 14 గ్రామాల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న అమ్మవారి ఉత్సవం ఏట ఘనంగా నిర్వహించడం పరిపాటి. ఇందుకోసం సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. మంగళవారం సాయంత్రం అనుపు ఉత్సవం నిర్వహిస్తారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దర్శనాలు ఈనెల 18న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం జరుగుతుందన్నారు. ఈ కారణంగా దర్శనాలు 6 గంటల తర్వాత లభించవని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
విశాఖ పోర్టు పనితీరును బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అభినందించారు. విశాఖ పోర్టు కార్యాలయంలో పోర్టు అథారిటీ చైర్మన్ అంగముత్తుతో భేటీ అయ్యారు. పోర్ట్ అథారిటీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తూ ముందుకు వెళుతుండడం విశాఖకు గర్వకారణం అన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో గణనీయమైన మెరుగుదలను చూపించడానికి కారణమైన పోర్టు ఛైర్మన్‌ను మాజీ ఎంపీ అభినందించారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దర్శనాలు ఈనెల 18న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం జరుగుతుందన్నారు. ఈ కారణంగా దర్శనాలు 6 గంటల తర్వాత లభించవని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
రుషికొండ రాజకోట రహస్యం ఎన్నికలకు ముందు బయటపడితే వైసీపీకి ఆ 11 సీట్లు కూడా వచ్చేది కాదని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. రుషికొండ భవనాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు. ముందు టూరిజం ప్రాజెక్ట్ అని తర్వాత ఫైవ్ స్టార్ హోటల్‌గా, తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ప్రకటించి మభ్య పెట్టారని అన్నారు. సెక్యూరిటీ పేరుతో తప్పించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత విశాఖ వచ్చిన పల్లా శ్రీనివాసరావుకి విమానాశ్రయంలో పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన శ్రీనివాసరావుకు తాతయ్యబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిలా పని చేయాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరావు సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యతను అప్పగించినట్లు చంద్రబాబు ఆయనకు చెప్పారు.
టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావుతో పలు రాజకీయం అంశాలపై చర్చించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలని లోకేశ్ సూచించారు. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖలో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల్లో ఆరేళ్ల పాపపై అత్యాచారం ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతడిని ఏఎస్పీ ధీరజ్ మీడియా ముందు హాజరుపరిచారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. అతనిపై పోక్సో కేసు నమోదైందని, కఠిన శిక్ష పడుతుందని ఏఎస్పీ తెలిపారు. సీఐ నవీన్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.