India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు శాసనమండలలో విపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, అధినేత జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బొత్సాకు మూడు సభలో ప్రాతినిత్యం వహించే అవకాశం దక్కింది.

అచ్యుతాపురం సెజ్ ఘటనలో గాయపడిన వారిని అనకాపల్లికి సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గాయపడిన వారిని బస్సులో తరలిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సగం కాలిన శరీర భాగాలతో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వారి ఫొటోలు కంటితడి పెట్టిస్తున్నాయి.

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సెజ్ లోని అగ్నిమాపక యంత్రంతో పాటు 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. రియాక్టర్ పేలుడు ధాటికి మొదటి అంతస్తు శ్లాబు కూలిపోగా, శిథిలాల కింద ఉన్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 16మంది కార్మికులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో కార్మికులు శిథిలాల్లో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. ప్రాథమిక సమాచారం మేరకు రియాక్టర్ పేలడంతో గ్యాస్ ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఊపిరాడక కొంతమంది శిథిలాల మధ్యలో మరి కొంతమంది చిక్కుకొని మృత్యువాత పడ్డారు. సుమారు 14 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికారులు వివరాలు పూర్తిగా వెల్లడించాల్సి ఉంది.

అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కోటవురట్ల మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల బాలికపై స్థానికంగా ఉంటున్న పాములు అనే వ్యక్తి అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి బుధవారం సందర్శించారు. ప్లాంట్ పరిస్థితిపై ఆరా తీశారు. ప్లాంట్ నిర్వహణకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రజలు విశాఖ ఉక్కును వాడాలని మంత్రి కోరారు.

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యానారాయణ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బొత్సకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. బొత్స వెంట విశాఖ, విజయనగరం జడ్పీ ఛైర్మన్లు జల్లి సుభద్ర, మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఉత్తరాంధ్ర కీలక నేతలు ఉన్నారు.

అనకాపల్లి(D) కైలాసపురం ఆశ్రమంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ST కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. విద్యార్థుల మరణాలు, అస్వస్థతపై నివేదిక ఇవ్వాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీవీ శంకరరావు ఆదేశించారు. మరోవైపు ఆశ్రమ నిర్వాహకుడు పాస్టర్ కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. పాసా ట్రస్ట్‌ను సీజ్ చేశారు.

విశాఖ నగరం కంచరపాలెం జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈనెల 23న నిరుద్యోగ యువతకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి సీహెచ్ సుబ్బిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల్లో 750 ఖాళీలను భర్తీ చేసేందుకు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 10, ఇంటర్, డిగ్రీ, డిప్లోమా ఎలక్ట్రికల్, ఫార్మసీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

విశాఖ నగరం సింహాచలం దేవస్థానం భూ సమస్యను పరిష్కరించాలని తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన అమరావతిలో చంద్రబాబును కలిశారు. గతంలో 296 జీవోకు సంబంధించి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు తెలిపారు. మళ్లీ అదే జీవోను కొనసాగించి మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.