India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తపాలా వినియోగదారుల సమస్యలు ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 28న విశాఖ నగరం ఎంవీపీ కాలనీలోని తపాలా శాఖ రీజినల్ కార్యాలయంలో 100వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ప్రసన్న రెడ్డి తెలిపారు. అల్లూరి, పార్వతీపురం, కోనసీమ, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తపాలా వినియోగదారులు సమస్యలను ఈనెల 21వ తేదీలోగా రీజినల్ కార్యాలయం చిరునామాకు అందజేయాలన్నారు.
చేపల వేట నిషేధం గడువు జూన్ 15వ తేదీ అర్ధరాత్రితో ముగుస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధం అవుతున్నారు. 61 రోజుల చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులు చినిగిన వలలు, పాడైన పడవలకు మరమ్మతులు చేసుకున్నారు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం జాలరిపేట మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. పరవాడ మండలంలో 120 పడవల ద్వారా మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ ఉంటారు.
సామాజిక పెన్షన్‌లు పెంచుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విశాఖ జిల్లాలో 1,65,432 మంది లబ్ధి పొందనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పెన్షన్ పెంపు వల్ల ప్రతినెల అదనంగా రూ.21.27 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ పథకాన్ని ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌గా ప్రభుత్వం మార్పు చేసింది. విశాఖ జిల్లాలో 16 రకాల పెన్షన్ దారులు ఉన్నట్లు తెలిపారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు హోంశాఖ కేటాయించి ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఈ ప్రాంతం వారికి హోంశాఖ రావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్ కేబినేట్‌లో ప్రస్తుత చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా పనిచేశారు. నాడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నేడు రాజాం నియోజకవర్గంలో భాగమైంది.
సీఎం చంద్రబాబును అమరావతి సచివాలయంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. హోమ్ మినిస్టర్‌గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. నమ్మకం నిలబెట్టుకుంటానని చంద్రబాబుకు ఈ సందర్బంగా తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతను దైవ కార్యంగా భావిస్తానని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తనకు కీలకమైన హోం శాఖను అప్పగించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.
రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. విశాఖ విచ్చేసిన మంత్రి ఐఎన్ఎస్ డేగాలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రక్షణ రంగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ బలమైన స్వావలంబన కలిగిన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మొదటి హోంమంత్రిగా అనిత రికార్డు సృష్టించారు. 62 ఏళ్ల తర్వాత పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి వరించింది. మొదటి సారి కేబినెట్‌లో చోటు సంపాదించుకున్న అనితకు చంద్రబాబు హోంశాఖను అప్పజెప్పి రాష్ట్ర శాంతిభద్రతలు ఆమె చేతిలో పెట్టారు. వృత్తి పరంగా టీచర్ కావడం ప్లస్ పాయింట్. ప్రతి విషయంపై సమగ్రమైన అవగాహన ఉండటం, వాగ్ధాటి, సూటిగా మాట్లాడేతత్వం ఆమెకు కలిసొచ్చే అంశాలు.
రెండోసారి కేంద్ర రక్షణ శాఖ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా విశాఖపట్నం వచ్చిన రాజ్ నాథ్ సింగ్‌కు విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో ఐఎన్ఎస్ జలస్వా నౌకపై దిగారు. అనంతరం ఈస్ట్రన్ ప్లీట్‌లో డేట్ సీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్లో సందర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
త్వరలో మేయర్‌ను కూడా దించేస్తామని టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు అత్యంత అవినీతి పరులుగా వ్యవహరించారని, కొన్ని సాంకేతిక మార్పులు చేశాక.. మేయర్ మార్పులు జరుగుతాయని అన్నారు. జగన్ ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారని ఆయన విమర్శించారు.
Sorry, no posts matched your criteria.