India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖను కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మంత్రిగా అనిత ఉన్నారు. పాయకరావుపేట నియోజకర్గం నుంచి మొదటి మంత్రి అనితే కావడం గమనార్హం. టీచర్ పనిచేసిన అనిత 2014లో మొదటిసారి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 కొవ్వురులో పోటీ చేసి మాజీ హోంమంత్రి తానేటి వనిత చేతిలో ఓడిన అనితను హోంమంత్రి వరించడం విశేషం.
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడితో పాయకరావుపేట ఎమ్మెల్యే, మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో ఆయన స్వగృహంలో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిని అనిత శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పలు విషయాలపై వారు చర్చించారు. మంత్రి పదవి పొందిన అనితను రామకృష్ణుడు అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని రామకృష్ణుడు సలహా ఇచ్చారు.
జూనియర్లకు మంత్రులుగా అవకాశం రావడం పట్ల సీనియర్‌గా ఆహ్వానిస్తున్నానని అయ్యన్నపాత్రుడు గురువారం తెలిపారు. సీనియర్లకు అవకాశం ఇవ్వలేదంటున్నారని.. తనకు 25 ఏళ్లకే NTR మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఇప్పటికే 5సార్లు మంత్రిగా, ఒకసారి MPగా చేశాను మిగతావారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా’ అని పేర్కొన్నారు. ‘పదవి రానివారిని చంద్రబాబు ఓదార్చాలా.. మాకు MLA టికెట్ ఇవ్వడమే గొప్ప’ అని వ్యాఖ్యానించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ శుక్రవారం నగరానికి రానున్నారు. రెండవసారి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయానికి ప్రత్యేక విమానంలో మద్యాహ్నం 12:20 గంటలకు విశాఖలో ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మద్యాహ్నం 12:50 గంటలకు విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలస్వా నౌకపై రక్షణ శాఖ మంత్రి దిగనున్నారు.
విశాఖలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడీ కె.రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫ్రీ మెట్రిక్-8, పోస్ట్ మెట్రిక్-14, వసతి గృహాలు ఉన్నట్లు తెలిపారు. ఫ్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 872, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 672 మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. వివరాల కోసం MVP కాలనీ, భీమిలిలోని సహాయ సాంఘీక సంక్షేమశాఖ కార్యాలయాలను సంప్రదించాలన్నారు.
కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీ బొడ్డుమామిడి లంకకు చెందిన కుండ్ల రాధమ్మ(19)అనే యువతి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాధమ్మ చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఆ తర్వాత సోదరుడు మృతి చెందాడు. తనను ఎంతో అపురూపంగా చూసుకునే నాన్నమ్మ ఇటీవలే చనిపోయింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రాధమ్మ గురువారం ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంప ఎస్సై లోకేశ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.
ఉపాధ్యాయ ఉద్యోగాల కల్పన దిశగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన చంద్రబాబు యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఐదేళ్లపాటు ఇదిగో డీఎస్సీ అంటూ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరో నాలుగు కీలక ఫైల్స్‌పై సంతకాలు చేసిన చంద్రబాబు మంచి పాలనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారం కోసం జూలై 29 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ.గిరిధర్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు.
విశాఖలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్ నగర్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్న యువతి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాధిక (22) డిగ్రీ పూర్తి చేసింది. ఈ నేపాథ్యంలో తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని రాధిక మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాయకరావుపేట ఎమ్మెల్యే మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె అయ్యన్నను సత్కరించారు. మంత్రి పదవి చేపట్టిన అనితకు అయ్యన్న శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. అందరి సహకారం సమన్వయంతో విశాఖ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.