Visakhapatnam

News June 13, 2024

స్పెషల్ గెటప్‌లో విశాఖ సీపీ

image

గంగవరం పోర్ట్ నిర్వాసితుల కార్మికుల బడాఖానా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీస్ కమిషనర్‌కు చక్కటి సన్మానం చేశారు. మత్స్యకారుడి వేషంలో ఒక చేత్తో వల, మరో చేతితో చేప, భుజం మీద బ్యాగు, నెత్తి మీద టోపీతో పోలీస్ కమిషనర్ రవిశంకర్ వినూత్నంగా కనిపించారు.

News June 13, 2024

విశాఖ: పరీక్ష తేదీల్లో మార్పు

image

విశాఖ జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్లకు జరగనున్న పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పు జరిగినట్లు విశాఖ జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. ఈనెల 20 తేదీన 6,8 తరగతులకు, 21తేదీన 7,9 తరగతులకు మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు జరుగుతుందన్నారు. హాల్ టికెట్లకు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News June 13, 2024

అనితకు మంత్రి పదవిపై కొణతాల స్పందన

image

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కడంపై అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పందించారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. కష్ట కాలంలో పార్టీకి సేవలు అందించిన అనితకు మంత్రి రావడంపై స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజల కలలను సాకారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా పాలన సాగుతుందన్నారు.

News June 13, 2024

మల్కాపురం సీఐపై సస్పెన్షన్ ఎత్తివేత

image

మల్కాపురం సీఐ ఎస్.సన్యాసి నాయుడుపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. 45 రోజుల కిందట ఎన్నికల్లో పోటీకి దిగిన ఓ రౌడీ షీటర్‌పై సీఐ దౌర్జన్యం చేసి దుర్భాషలాడి పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చారనే ఆరోపణలపై సీఐను సస్పెండ్ చేశారు. అనంతరం నిర్వహించిన దర్యాప్తులో వ్యక్తిగత కక్షతో రౌడీషీటర్ లేనిపోని ఆరోపణలు చేసినట్లు తేలింది.

News June 13, 2024

గెలుపోటములు సహజం: వైవీ సుబ్బారెడ్డి

image

ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులను అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News June 13, 2024

విశాఖ: 509 ఉద్యోగాలు.. టెన్త్ అర్హత

image

కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్‌లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సీహెచ్ సుబ్బిరెడ్డి తెలిపారు. వివిధ కంపెనీలో 509 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 18-40 ఏళ్ల వయసు గల మహిళ, పురుష అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చునని తెలిపారు.

News June 13, 2024

ఆర్కిటెక్చర్ పదో సెమిస్టర్ ఫలితాల విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి ఫలితాలను పొందవచ్చునని సూచించారు.

News June 13, 2024

పాడేరు ఘోర ప్రమాదంలో.. అచ్యుతాపురం యువకుడి మృతి

image

పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం అచ్యుతాపురంలో విషాదం నింపింది. సౌండ్స్ సిస్టమ్స్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి ముగ్గరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అచ్యుతాపురానికి చెందిన పీ.లక్ష్మణ్(25) మృతిచెందాడు. ఈయనకు భార్య, 5 నెలలు బాబు ఉన్నారు. లక్ష్మణ్ మృతి చెందాడనే విషయం తెలిసి కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుపెట్టుకున్నారు.

News June 13, 2024

అమరావతిలో విశాఖ జిల్లా నేతల సందడి

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా TDP నేతలు సందడి చేశారు. కూటమి తరఫున గెలిచిన MP, MLAలు, పార్టీల నేతలు, నియోజకవర్గాల బాధ్యులు, ముఖ్య కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ MP శ్రీభరత్, MLAలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, TDP విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గండిబాబ్జీ, దక్షిణ నియోజకవర్గ బాధ్యుడు సీతంరాజు సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

News June 13, 2024

పాడేరు ఘాట్ వ్యాన్ ప్రమాదంలో బిడ్డ కోసం తల్లి సాహసం

image

పాడేరు ఘాట్‌లో సౌండ్ సిస్టం లోడుతో వెళ్తున్న వ్యాన్ బుధవారం బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తన బిడ్డను రక్షించుకునేందుకు ఓ తల్లి సాహసం చేసింది. వ్యాన్ కింద నలిగిపోతున్న బిడ్డకు ఏమీ కాకుండా కౌగిలిలో వదలకుండా పట్టుకుంది. దీంతో వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బిడ్డకు ఏమీ కాకుండ తల్లి చేసిన సాహసాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.