Visakhapatnam

News June 12, 2024

విశాఖ: నాడు టీచర్.. నేడు మినిస్టర్

image

MA, BED చేసిన వంగలపూడి అనిత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2014లో పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె దశాబ్ధ కాలంలో ఎన్నో పదవులు చేపట్టారు. టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా, టీటీడీ సభ్యురాలిగా సేవలందిచారు. పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిత చంద్రబాబు కేబినెట్‌లో చోటుదక్కించుకున్నారు.

News June 12, 2024

విశాఖ: పెరుగుతున్న టమోటా ధరలు

image

విశాఖ నగర పరిధిలో గల రైతు బజార్లలో కిలో టమోటా రూ.50కి విక్రయిస్తున్నారు. బయట మార్కెట్‌లో కిలో రూ.70కి పెరిగింది. ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు తెలిపారు. వర్షాలు లేకపోవడం, తోటలకు తెగుళ్లు సోకడం తదితర కారణాల వల్ల దిగుబడి తగ్గిందని తెలిపారు. దీంతో మధ్యతరగతి ప్రజలు టమాటాల జోలికి వెళ్లడం లేదు.

News June 12, 2024

గంటా, అయ్యన్నకు ఈసారి నో ఛాన్స్!

image

ఏపీ నూతన కేబినెట్ కూర్పు చంద్రబాబు రాజకీయ చతురతకు నిదర్శనంగా మారింది. ఉమ్మడి విశాఖకు సంబంధించి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణ వంటి సీనియర్లను సైతం పక్కనపెట్టి పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు మంత్రి పదవి ఇచ్చారు. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరికి మాత్రమే కేబినెట్లో చోటుదక్కడం గమనార్హం.

News June 12, 2024

వంగలపూడి అనితకు మంత్రి పదవి

image

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఒకరికే అవకాశం దక్కింది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను మంత్రి పదవి వరించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ జాబితా విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలో కీలకపాత్ర వహించిన అనితకు మంత్రి పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ జాబితాలో గంటా, అయ్యన్న వంటి సీనియర్లకు చోటు లభించకపోవడం గమనార్హం.

News June 11, 2024

ఎస్ రాయవరం: ఇంటిని ఢీకొట్టిన లారీ

image

ఎస్ రాయవరం మండలం గోకులపాడు వద్ద లారీ మంగళవారం ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విశాఖ నుంచి కర్ణాటక వెళుతున్న లారీ గోకులపాడు వద్దకు వచ్చేసరికి లారీ డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకుని ఇంటిని ఢీకొట్టాడు. ఇంటిని ఢీకొని లారీ ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

News June 11, 2024

శారదా నదిలో పడి ఇద్దరు యువకుల మృతి

image

యలమంచిలి మండలం తెరవుపల్లిలో శారదా నదిలో మునిగి దిమిలికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాసరావు, గాజువాకకు చెందిన జగన్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. వారం క్రితం మేనమామ ఇంటికి వచ్చిన వీరు ప్రతిరోజు నదికి వెళ్లేవారని ఇవాళ నీటి ఒరవడి ఎక్కువగా ఉండడం వల్ల వీరు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.

News June 11, 2024

విశాఖ: హత్య కేసు.. పదేళ్ల జైలుశిక్ష

image

హత్య కేసులో ముద్దాయికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ విశాఖపట్నం పీడీజే కోర్టు తీర్పునిచ్చిందని SP మురళీకృష్ణ తెలిపారు. ’నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పైల రమణకు సుర్ల వెంకటరమణతో భూతగాదాలున్నాయి. ఈ క్రమంలో జరిగిన గొడవతో వెంకటరమణను పైల రమణ హత్య చేశాడు. మృతుడి తల్లి చిన్నమ్మలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశాం’ అని పేర్కొన్నారు.

News June 11, 2024

తమిళనాడు మాజీ CMకు విశాఖ ఎంపీ ఆహ్వానం

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం గన్నవరం విమానాశ్రయం చేరుకోగా.. విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు కేటాయించిన హోటల్‌కు‌ తీసుకువెళ్లారు.

News June 11, 2024

విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు: చంద్రబాబు

image

రాష్ట్రంలో విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ శాసనసభ పక్ష నేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అత్యంత ఆదరణ ఇచ్చిన విశాఖ నగరం దేశంలోనే పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాం’. ఈ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

News June 11, 2024

పాడేరు జాతరలో దారుణం.. ఆరేళ్ల పాపపై అత్యాచారం?

image

అల్లూరి జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతరలో ఆరేళ్ల పాపపై దుండగులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. జాతరకు ఓ కుటుంబం రాగా.. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో పాపను దుండగులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి పరారయ్యారట. పాప ఏడుస్తూ విషయం పెద్దవాళ్లకి చెప్పడంతో పాడేరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.