Visakhapatnam

News March 17, 2024

సువిధ యాప్ ద్వారా అనుమతులు: సీపీ

image

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఆరు చెక్ పోస్ట్‌ల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశించారు. రాజకీయ సభలు, సమావేశాలకు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 478 పోలింగ్ కేంద్రాలను స్వల్ప సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి రెండు స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News March 17, 2024

అనకాపల్లి ఎంపీ సీటు.. ఆ బీసీ ఎవరు?

image

అనకాపల్లి MP అభ్యర్థి పేరును వైసీపీ పెండింగ్ పెట్టింది. కూటమి అభ్యర్థిగా BJP నుంచి సీఎం రమేశ్ ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరగడంతో ధీటైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. మాడుగుల MLA అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును MP అభ్యర్థిగా ప్రకటించి, అక్కడ నుంచి బూడి కుమార్తె, ZPTC ఈర్ల అనురాధని పోటీ పెడతారని ప్రచారం జరుగుతోంది. మరి వైసీపీ అభ్యర్థిగా ఆ బీసీ నేత ఎవరి మీరు భావిస్తున్నారు? 

News March 17, 2024

పది పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ

image

అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలయ్యేలా పోలీస్ అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.పరీక్షా కేంద్రాలు వద్ద జన సమూహాలు ఉండకూడదన్నారు.

News March 17, 2024

విశాఖ: పలు రైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు

image

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డీసీఎం ఏకె. త్రిపాఠి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 28వ తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ- గుంటూరు- (22701), గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖ- మచిలీపట్నం (17220) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. మరికొంటిని దారి మళ్లించారు.

News March 17, 2024

అనకాపల్లి: ‘ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం’

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి, ఎస్పీ కేవీ మురళీ కృష్ణ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనకాపల్లి వ్యాప్తంగా 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా రూ.50 వేల వరకు నగదు క్యారీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

News March 16, 2024

అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణి

image

అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణికి టిక్కెట్ కేటాయిస్తూ అధిష్ఠానం సస్పెన్స్‌కు తెరదించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన గుమ్మా తనూజారాణికి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కుమారుడు వినయ్ తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. తనూజారాణి తండ్రి శ్యాం సుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ సర్పంచ్‌గా చేస్తున్నారు.

News March 16, 2024

విశాఖలో హీరో శ్రీ విష్ణు సందండి

image

విశాఖ నగరంలో హీరో శ్రీ విష్ణు శనివారం సందడి చేశారు. ఆయన నటించిన ఓమ్ భీమ్ బుష్ చిత్ర బృందం ఓ హొటల్‌లో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తనతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించారన్నారు. ఈ చిత్రాన్ని శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారన్నారు. మార్చి 22న విడుదల అవుతుందన్నారు. కుటుంబ సమేతంగా, ఇంకా యూత్‌ను ఆకట్టుకునే చిత్రమని పేర్కొన్నారు.

News March 16, 2024

BREAKING: చంద్రబాబుతో మాజీ మంత్రి గంటా భేటీ

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇంకా టికెట్ ఖరారు కాని నేపథ్యంలో చంద్రబాబును కలిసి విశాఖ జిల్లాలోని టిక్కెట్ కేటాయించాలని గంటా కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2024

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై సెస్పెన్స్

image

అన్ని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం అనకాపల్లి సీటును మాత్రం పెండింగ్‌లో ఉంచింది. బీసీకి కేటాయించినట్లు చెప్పారు కానీ..అభ్యర్థి పేరు మాత్రం చెప్పలేదు. దీంతో ఎంపీ అభ్యర్థి పేరు ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది.