India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవి శంకర్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్‌లలో సంబంధిత రౌడీ షీటర్లకు పోలీస్ అధికారులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హద్దు మీరితే పీడీ యాక్ట్ అమలు చేయాల్సి వస్తుందని అన్నారు.
విశాఖ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావటంతో బీచ్‌లో సందడి వాతావరణం నెలకొంది. పర్యాటకుల రద్దీ పెరగటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. RK బీచ్, భీమిలి బీచ్‌లలో కూడా ఇదే పరిస్థితి. వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో పిల్లలతో బీచ్‌లకు పోటెత్తారు.
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్ రేపు విడుదలకానుంది. అభిమానుల కోసం విశాఖ జిల్లాలోని పలు థియేటర్లలో రేపు 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. విశాఖలో శరత్, శ్రీ కన్య, మెలోడీలో స్క్రీనింగ్ ఉండగా.. గాజువాకలో లక్ష్మీ కాంత్, శ్రీ కన్యా స్క్రీన్-2 థియేటర్‌లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు.SHARE IT
రేపు అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి అన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.
➩ విశాఖలో 20,570 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా.. NDA కూటమి-13,583(66.03%), YCP-5,399(26.25%), INDIA కూటమి-837(4.07%) మంది ఓటేశారు
➩ అనకాల్లిలో మొత్తం 19,125 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA కూటమి-12,042(62.96%), YCP-5,777(30.20%), INDIA కూటమి-818(4.27%) మంది ఓటేశారు
➩ అరకులో 21,432 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA కూటమి-9,312(43.44%), YCP-5,535(25.83%), INDIA కూటమి-4,113(19.19%) మంది ఓటేశారు
అల్లూరి ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మోదకొండమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శతకం పట్టు వద్దకు ఘటాలను ఊరేగింపుగా తరలించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మాజీ సీఎం జగన్ శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్ అన్నారు. శనివారం అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల కాలంలో అరాచకాలు విధ్వంసాలు కక్ష సాధింపులకు తెగపడి ఆస్తులు నష్ట పరిచారని విమర్శించారు. జగన్ ఒక్కరోజులోనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మాట్లాడడం సరికాదన్నారు.
ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ పాడేరులో జరగనున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈమేరకు 800 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు జరగకుండా నివారించడానికి పది క్రైమ్ పార్టీలను ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో చెకింగ్ సిబ్బందికి డీఆర్ఎం సౌరం ప్రసాద్ బాడీ వోర్న్ కెమెరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారదర్శకత, జవాబుదారీతనం భద్రతను పెంచడానికి ఈ కెమెరాలు దోహద పడతాయన్నారు. రైళ్లలోను, రైల్వే స్టేషన్లలోనూ తనిఖీ ప్రక్రియను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.
Sorry, no posts matched your criteria.