India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కాన్వెంట్ జంక్షన్ సమీపంలోని ఓ డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్థానికులకు సహాయంతో గెడ్డలో పడిపోయిన వ్యక్తిని పోలీసులు బయటకు తీశారు. మృతుడు 45 వయస్సు పోలీసులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. పత్రికా రంగంలో కొత్త ఒరవడలు సృష్టించిన ఈనాడు దినపత్రిక విశాఖ నుంచే ఆయన ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ పత్రిక అపూర్వ ప్రజాధరణ పొందింది. అదేవిధంగా నగరంలో డాల్ఫిన్ హోటల్‌ను ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నగరంలో ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ ఆ డాల్ఫిన్ హోటల్‌కు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.
విశాఖ ఆర్.కె బీచ్‌లో గుర్తు తెలియని ఓ యువకుడి మృతదేహం కొట్టుకువచ్చింది. నలుపురంగు టీషర్ట్ వేసుకొని.. చేతిపై జైశ్రీరాం అని పచ్చబొట్టు ఉందని మహారాణిపేట ఎస్.ఐ లక్ష్మీ తెలిపారు. ముఖంపై గాయాలను గుర్తించామని వెల్లడించారు. మృతుని వివరాలు తెలిసినవారు మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. 94407 96010, 83310 41628 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాలోని అరకు, పాడేరు మినహా మిగిలిన చోట్ల కూటమి విజయం సాధించింది. TDP నుంచి గంటా, అయ్యన్న, బండారు వంటి మాజీ మంత్రులు ఉన్నారు. మహిళా కోటాలో అనిత ఉండగా.. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన పల్లాతోపాటు ఎక్కసార్లు గెలిచిన వెలగపూడి, గణబాబు కూడా TDP అభ్యర్థులే. జనసేనలో మాజీ మంత్రి కొణతాలతో పాటు పంచకర్ల, మొదటిసారి గెలిచిన సుందరపు, వంశీ ఉన్నారు. బీజేపీ తరఫున విష్ణుకుమార్‌కు ఇది రెండో విజయం.
రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష మరికొద్ది సేపట్‌లో ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 52 ఆన్‌లైన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. పరీక్షకు 10,805 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ ఆచార్య టీవీ కృష్ణ తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఆయన తెలిపారు.
అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో 40 ఏళ్ల రికార్డును BJP బ్రేక్ చేసింది. 1962లో జరిగిన పునర్విభజనలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గ కేంద్రమయ్యింది. అప్పటినుంచి 2019వ రకు టీడీపీ ఎంపీ పి.అప్పల నరసింహం మెజారిటీ రికార్డుగా ఉండేది. ఆయన సాధించిన 1.74 లక్షల ఓట్ల మెజార్టీని 40 ఏళ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అధిగమించారు. వైసీపీ అభ్యర్థి ముత్యాలనాయుడుపై 2.96 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.
రామోజీ సంస్థల పేరుతో అనేక వ్యాపారాలు చేసిన రామోజీరావుకు ఈనాడు ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. 1974 ఆగస్టు 10న విశాఖలో సీతమ్మధార సమీపంలోని నక్కవానిపాలెం ఈనాడు ఆఫీసును ప్రారంభించారు. మొదట 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. అప్పట్లో చాలా పత్రికల పేర్లు ఆంధ్ర పదంలో మొదలయ్యేవి. దానికి భిన్నంగా అచ్చమైన తెలుగు పదంతో ప్రారంభించిన ఈనాడుకి ఈ ఆగస్టు 10కి యాభై ఏళ్లు. ఆ పండగ చూడకుండానే రామోజీ కన్నుమూశారు.
స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఈనెల 13న జీతాలు చెల్లించనున్నారు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలకు స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ తెలియజేసినట్లుకార్మిక నాయకులు తెలిపారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనంలో జరిగిన సమావేశంలో జీతాలు చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సిఎండి 13న జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్ పదవికి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కోలా గురువులు రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీ పరంగా వచ్చిన ఈ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన రాజీనామా లేఖను రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు.
రక్తదానం చేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని పాడేరు సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డి శుక్రవారం కోరారు. అత్యవసర సమయంలో రక్తం లభించక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈమేరకు ఈనెల 9,10,11వ తేదీల్లో జరగనున్న మోదకొండమ్మ పండుగ సమయంలో పాడేరు సబ్ కలెక్టర్ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ధాత్రి తెలిపారు. ఆసక్తి గల వారు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.