Visakhapatnam

News June 7, 2024

విశాఖ మేయర్ పీఠంపై కూటమి గురి..?

image

విశాఖ నగరం మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. GVMCలో 98 స్థానాలకు ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో TDPకి 29, జనసేనకి 3, BJP, CPM, CPIలకు ఒక్కొక్కరు, 5 స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు. మిగతా 57 మంది YCP కార్పొరేటర్లు. YCPలో అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటే మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవచ్చని చర్చ జరుగుతోంది.

News June 7, 2024

విశాఖ: మత్తు పదార్థాలతో ఇద్దరు అరెస్ట్

image

ఎండీఎంఏ(మిథైలెన్డియోక్సి మెథాంపేటమిన్) డ్రగ్‌ను కలిగి ఉన్న ఇద్దరు యువకులను మహారాణిపేట పోలీసులు, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 3.316 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. టర్నల్ చౌల్ట్రీ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎం.సాయిరాం, టీ.సంగ్రామ్ సాగులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా డ్రగ్స్ లభించాయి.

News June 7, 2024

విశాఖ: మిగులు సీట్లు భర్తీకి నోటిఫికేషన్

image

విశాఖపట్నం జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగుల సీట్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. 6,7,8,9 తరగతులలో మిగిలిన సీట్లు కొరకు ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. సీట్లు వివరాలు, పరీక్ష విధివిధానాలు సంస్థ వెబ్సైట్లో సరిచూసుకోవాలన్నారు.

News June 6, 2024

నెలరోజుల్లో అగనంపూడి టోల్ ప్లాజా ఎత్తివేస్తా: పల్లా

image

గాజువాక నియోజకవర్గం పరిధిలో అగనంపూడి టోల్ ప్లాజాను నెలరోజుల్లో ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుతానన్నారు. గాజువాక ఖ్యాతి దేశానికి తెలిసేలా తనకు అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.

News June 6, 2024

డాక్టర్ నుంచి అరకు ఎంపీగా

image

రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజరాణి గెలుపొందారు. హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన తనూజరాణి ఎంబీబీఎస్ చేశారు. వైద్య వృత్తిలో డీఎంహెచ్‌వో, ఐసీడీఎస్ కార్యాలయాల్లో జిల్లా ఎపిడెమియాలజిస్టుగా పనిచేసేవారు. 2022లో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కుమారుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్‌ను వివాహమాడారు.

News June 6, 2024

విశాఖ: మిగులు సీట్లు భర్తీకి నోటిఫికేషన్

image

విశాఖపట్నం జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగుల సీట్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. 6,7,8,9 తరగతులలో మిగిలిన సీట్లు కొరకు ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. సీట్లు వివరాలు, పరీక్ష విధివిధానాలు సంస్థ వెబ్సైట్లో సరిచూసుకోవాలన్నారు.

News June 6, 2024

అల్లూరి: ఒకే మండలంలో ఎంపీ, ఎమ్మెల్యే

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో హుకుంపేట మండలానికి మహర్దశ పట్టనుందా అనేది భవిష్యత్తులో తేలనుంది. హుకుంపేట మండలానికి చెందిన ఇరువురు ఎంపీ, ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అరకు పార్లమెంట్ సభ్యురాలిగా అడ్డుమండ గ్రామానికి చెందిన గుమ్మ తనూజారాణి, అరకు ఎమ్మెల్యేగా కొంతిలి గ్రామానికి చెందిన రేగం మత్స్యలింగం విజయం సాధించారు. ఇద్దరూ వైసీపీ నుంచి విజయం సాధించడం కొస మెరుపు.

News June 6, 2024

కూటమికి కంచుకోటగా విశాఖ

image

కూటమికి కంచుకోటగా విశాఖ జిల్లా మారింది. 2014లో విశాఖ జిల్లాలో కూటమి తన సత్తా చూపింది. అనంతరం 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా సాగిన సమయంలో కూడా విశాఖలో 4 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచి తమ సత్తా చాటారు. తాజాగా విశాఖ జిల్లా మొత్తం కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజధానిగా విశాఖను జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా.. ప్రజలు విశ్వసించకుండా కూటమికే జై కొట్టారు. 

News June 6, 2024

శ్రీభరత్‌కు చంద్రబాబు నుంచి పిలుపు

image

విశాఖ ఎంపీగా గెలుపొందిన టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌కు మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావలసిందిగా చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. దీంతో గురువారం విశాఖలో ఆయన కార్యక్రమాలన్ని రద్దు చేసుకుని విమానంలో మంగళగిరి బయలుదేరి వెళ్లారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలో రేపు జరిగే NDA కూటమి సమావేశంలో శ్రీభరత్ పాల్గోనున్నట్లు తెలుస్తోంది.

News June 6, 2024

విశాఖలో ఎండీఎంఏ పౌడర్ స్వాధీనం

image

విశాఖ నగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు గ్రాముల ఎండీఎంఏ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పౌడర్ కలిగి ఉన్న ఒక యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఎండీఎంఏ పౌ‌డర్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు.. దీనిని ఎవరు సరఫరా చేశారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.