India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నౌపాడ- పుండీ- తిలారు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా విశాఖ- గుణుపూర్ రైలు గురువారం రద్దు చేస్తు న్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యరాణి, పూరి, కటక్ మెమో రైళ్లు యథావిధిగా తిరుగుతాయని, ప్రయాణికులు గమనించగలరని పేర్కొన్నారు. ఈ మార్పుకి అనుగుణంగా ప్రయాణికులు ప్రణాళికలు వేసుకోవాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో సూచించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నట్లు విశాఖ జిల్లా అధికారులు తెలిపారు. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దాదాపు 50 రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.
సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు విశాఖ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నట్లు డిఇఓ చంద్రకళ తెలిపారు. బుధవారం విశాఖ జిల్లాలో మూడు కేంద్రాల్లో జరిగిన పదో తరగతి పరీక్షలకు 261 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ పరీక్షకు 206 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో విశాఖపట్నం జిల్లా అధికారులు, సిబ్బంది అనిర్వచనీయమైన పాత్ర పోషించారని, అప్పగించిన బాధ్యతల్ని అత్యంత అంకితభావంతో నిర్వహించారని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ.మల్లికార్జున అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులను అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రైల్వే అధికారులు ఘనంగా నిర్వహించారు. డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పర్యావరణ ప్రాధాన్యత తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్లో ప్రయాణికులకు చేతి సంచులను పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రచారం జరిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు మంజు శ్రీ ప్రసాద్ నేతృత్వంలో మొక్కలు నాటారు.
గాజువాకలో గుడివాడ అమర్నాథ్‌పై గెలిచి పల్లా శ్రీనివాసరావు రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. 1989లో గుడివాడ గురునాథరావు, పల్లా సింహాచలంపై 13,903 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 35 ఏళ్ల తర్వాత వారి వారసులు గాజువాకలో పోటీపడ్డారు. పల్లా శ్రీనివాసరావు తన తండ్రి ఓటమికి ప్రతీకారంగా అమర్నాథ్‌పై 95,235 ఓట్ల మెజార్టీతో విజయకేతనాన్ని ఎగురవేశారు.
విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలకు అనుకూలంగా స్టాప్‌బోర్డులను ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. వారే స్వయంగా వీటిని తొలగించడానికి ప్రయత్నించారు. ఈలోపు అక్కడకు పోలీసులు చేరుకున్నారు. కాగా..సిరిపురం నుంచి రేసపువానిపాలెం వైపు వెళ్లే మార్గానికి మధ్యలో స్టాపర్లను గతంలో ఏర్పాటు చేశారు.
జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో పెందుర్తిలోనే అత్యధిక మెజార్టీ సాధించింది. పెందుర్తిలో పంచకర్ల రమేశ్ బాబుకు.. పవన్‌కళ్యాణ్ కంటే 10 వేల ఓట్ల ఎక్కువ మెజార్టీ వచ్చింది. పంచకర్లకు 81,870 ఓట్ల మోజార్టీతో రాగా.. పవన్‌కు 70,279 మెజార్టీ వచ్చింది. ఉమ్మడి విశాఖలో మిగిన 3 స్థానాల్లో అనకాపల్లిలో కొణతాల-65,764, యలమంచిలిలో సుందరపు విజయ్-48,956, విశాఖ సౌత్‌లో వంశీకృష్ణ-64,594 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు.
వార్డు మెంబర్ నుంచి ఉపముఖ్యమంత్రి అయిన బూడికి ఈ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. అనకాపల్లి MPగా పోటీ చేసి.. సీఎం రమేశ్ చేతిలో 2,96,630 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనూహ్యంగా వైసీపీ తరఫున మాడుగుల MLA బరిలో దిగిన అతని కుమార్తె ఈర్లె అనూరాధకు కూడా ఓటమి తప్పలేదు. TDP అభ్యర్థి బండారు 28,026 ఓట్ల మెజార్టీతో ఆమెపై గెలిచారు. మాడుగుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అతని కుమారుడికి 395 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కూటమి ప్రభంజనంలోనూ అల్లూరి జిల్లా ప్రజలు YCPకే పట్టం కట్టారు. అరకు MPగా గుమ్మ తనూజారాణి, MLAగా రేగం మత్స్యలింగం, పాడేరు MLAగా మత్య్సరాస విశ్వేశ్వరాజును గెలిపించారు. కాగా వీరు ముగ్గురూ తొలిసారిగా పార్లమెంటు, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అల్లూరిలో YCP అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు. వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో 2 స్థానాలు అల్లూరి జిల్లాలోనే 2 స్థానాలు ఉండడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.